పెద్ది తర్వాత బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోనేనా? నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ వేస్తున్నాడా?
టాలీవుడ్‌లోకి 'ఉప్పెన' సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బుచ్చి బాబు సన. డెబ్యూ మూవీతో వంద కోట్ల క్లబ్‌లో చేరి, ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక తన రెండో ప్రాజెక్ట్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎవరూ ఊహించని విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది'అనే సినిమాను తెరకెక్కించారు. ఈ భారీ బడ్జెట్ మూవీపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ఏంటీ? ఆయన తరువాత హీరో ఎవరు? అనేది హాట్ టాపిక్ మారింది.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కోసం బుచ్చిబాబు దాదాపు దాదాపు ఐదేళ్లు శ్రమించారు. ఈ గ్యాప్ సాధారణంగా ఇండస్ట్రీలో చాలా రిస్క్‌గా భావిస్తారు. కానీ బుచ్చిబాబు మాత్రం కథ, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్టింగ్ అన్ని అంశాలు పర్ఫెక్ట్‌గా ఉండాలని పట్టుదలతో ఈ గ్యాప్ తీసుకున్నారట. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించడం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను మరింత పెంచింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించబడిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ బజ్ ఏర్పడింది. 'పెద్ది' సినిమా బుచ్చిబాబు కెరీర్‌ను పూర్తిగా నిర్ణయించబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తే, ఆయన రేంజ్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ల సరసన చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆయన మూడో సినిమా కూడా పెద్ద స్టార్ హీరోతో, ఇంకా భారీ స్థాయిలో సినిమా తెరకెక్కించే అవకాశం లేకపోలేదు. అయితే ఇక్కడే ఒక పెద్ద సవాల్ మొదలైంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరూ వరుస ప్రాజెక్టులతో ఉన్నారు. S.S.రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్‌లతో పెద్ద హీరోలందరూ ముందుగానే కమిట్ అయిపోయారు. రాబోయే 2 లేక 3 సంవత్సరాల వరకు వారి కాల్ షీట్లు దాదాపు ఫుల్‌గా లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ముందు రెండు మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి టాప్ హీరోల డేట్స్ కోసం మరో రెండేళ్లు ఓపికగా వేచి ఉండాలి.కానీ, కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడం ఆయన మార్కెట్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, కంటిన్యూయిటీ కోల్పోవడం కమర్షియల్‌గా మారే అవకాశం ఉంది. మరొక మార్గం ఇంకో ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడం. ముఖ్యంగా కోలీవుడ్ ఇప్పుడు బుచ్చిబాబుకు మంచి ఆప్షన్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు దర్శకులు తమిళ స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. 'పెద్ది' బ్లాక్‌బస్టర్ అయితే, కోలీవుడ్‌లో కూడా బుచ్చిబాబుకు డిమాండ్ పెరగడం ఖాయం.
సూర్య, కార్తీ, శివకార్తికేయన్ వంటి హీరోలు మంచి ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. వీరితో ఒక పక్కా విలేజ్ మాస్ కథను ప్లాన్ చేస్తే, ప్రాజెక్ట్ త్వరగా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ హీరోలకు సౌత్ ఇండియా అంతటా మంచి మార్కెట్‌తో, వ్యాపారపరంగా కూడా లాభాలు సాధించే ఛాన్స్ ఉంటుంది. అయితే.. ఇప్పుడు టాలీవుడ్ దృష్టంతా 'పెద్ది' ఫలితంపైనే ఉంది. ఈ సినిమా హిట్ అయితే బుచ్చిబాబు కెరీర్ మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయమనే చెప్పాలి. అదే సమయంలో ఆయన టాలీవుడ్‌లోనే కొనసాగాలా, లేక కోలీవుడ్ వైపు వెళ్లాలా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది. మరి 'పెద్ది' సినిమా బుచ్చిబాబు జీవితాన్ని ఎలా మార్చుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications




