2000 కోట్లపై కన్నేసిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ తర్వాత ఆ సూపర్ స్టార్‌తో భారీ ప్లాన్!

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సెన్సేషనల్ హిట్స్‌తో ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సక్సెస్ పుల్ డైరెక్టర్ మరోసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్, హీరో క్యారెక్టర్ డిజైన్‌లో న్యూ డైమెన్షన్ చూపించడం వంగా స్టైల్‌గా మారింది. ఈ ప్రత్యేకత వల్ల ఆయనతో సినిమా చేయాలని అగ్ర హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండగా, ఆ తర్వాత బాలీవుడ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ప్రభాస్‌తో 'స్పిరిట్'
సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా నిలవబోతోందని టాక్. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఆడియో గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ మాస్ లుక్, ఇన్టెన్స్ డైలాగ్ డెలివరీ, వంగా మార్క్ రా టోన్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించి, మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రధాన షూటింగ్ పూర్తి చేయాలన్నది దర్శకుడి ప్లాన్. 2026లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Sandeep Reddy Vanga s Next Film to Be Ranbir Kapoor s Animal Park

'స్పిరిట్' తర్వాత 'యానిమల్ పార్క్'
ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి నటించిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, సందీప్ రెడ్డి వంగాను పాన్ ఇండియా లెవల్ డైరెక్టర్‌గా మరింత బలపరిచింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ పైనే ఉంది.

రణబీర్ కీలక అప్‌డేట్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఈ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో 'స్పిరిట్' షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారని, ఆ సినిమా పూర్తయ్యాకే 'యానిమల్ పార్క్'పై దృష్టి పెడతారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ సీక్వెల్‌లో రణబీర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని వెల్లడించారు. తొలి భాగం చివర్లో చూపించిన క్లోన్ కాన్సెప్ట్‌నే ఈ కథను మరింత రసవత్తరంగా మలుస్తుందని సమాచారం.

మూడు భాగాలుగా 'యానిమల్' ఫ్రాంచైజీ
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ కథను మూడు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు రణబీర్ తెలిపారు. అందులో రెండో భాగానికి 'యానిమల్ పార్క్'అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు చెప్పారు.'యానిమల్' కంటే డబుల్ బడ్జెట్‌తో ఈ సీక్వెల్‌ను రూపొందించనున్నారని టాక్. రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి పాత్రలు ఈ భాగంలో మరింత కీలకంగా ఉండనున్నాయి. 'యానిమల్' కంటే 'యానిమల్ పార్క్' ఇంకా క్రూరంగా, డార్క్‌గా ఉంటుందని సందీప్ రెడ్డి వంగా గతంలోనే హింట్ ఇచ్చారు.

2000 కోట్ల టార్గెట్?
'యానిమల్' సాధించిన రూ.900 కోట్ల వసూళ్లను దాటడమే కాకుండా, 'యానిమల్ పార్క్'తో రూ.1500-2000 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేస్తున్నారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. 2027లో షూటింగ్ ప్రారంభమైతే, 2028 చివర్లో లేదా 2029 ప్రారంభంలో ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు రణబీర్ అభిమానులు ఆయన రాబోయే ప్రాజెక్టులైన రామాయణ, లవ్ అండ్ వార్ తో సరిపెట్టుకోవాల్సిందే. 'స్పిరిట్'తో ప్రభాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని, ఆ తర్వాత 'యానిమల్ పార్క్'తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని సందీప్ రెడ్డి వంగా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X