ఆ సీక్వెల్ మిస్ చేసుకొని ఈ బిగ్ సీక్వెల్ ఆఫర్ పట్టేసిన శ్రద్ధా కపూర్?

భారతదేశంలోని ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా దాదాపు మేల్ డామినేషన్ లోనే సినిమాలు నడుస్తాయని అందరికీ తెలిసిందే. కానీ అలాంటి డామినేషన్ లో కూడా కొందరు హీరోయిన్ చిన్నగా జర్క్ ఇస్తారు. ఇపుడు ఇండియన్ సినిమా స్పాన్ మరింత లెవెల్లో మారుతూ ఉండగా హీరోయిన్స్ లో కొందరికి డిమాండ్ కూడా బాగానే ఉంది. అయితే మన తెలుగు సినిమాతో పాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలోనూ ఐటెం సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంది.

అయితే అలా అని ఇపుడు అన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెడితే క్లిక్ అవుతున్నాయా అంటే అది లేదని చెప్పాలి. పలు భారీ సినిమాలు .. అది కూడా అవసరం అయితేనే సినిమాల్లో ఐటెం సాంగ్స్ ని పెడుతున్నారు. ఒకప్పుడు అంటే ఐటెం సాంగ్స్ కి అంటూ సెపరేట్ గా కొందరు హీరోయిన్స్ ఉండేవారు . కానీ ఇపుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ ఎక్కువ క్యాష్ చేసుకోవడం కోసం వాటిని హీరోయిన్స్ అడిగినంత రెమ్యునరేషన్ లు ఇచ్చి తీసుకొస్తున్నారు.

after pushpa 2 shraddha kapoor got a big offer in war 2

ఇపుడు తెలుగు సహా హిందీలో కూడా పలువురు స్టార్ హీరోయిన్స్ తో అందులోని ఫామ్ లో ఉన్నవారిని తీసుకోడానికి బిగ్ సినిమాస్ మేకర్స్ ఇష్టపడుతున్నారు. ఇలా రీసెంట్ గా ఓ రేంజ్ హైప్ ఇచ్చిన పాన్ ఇండియా సినిమా ఐటెం సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 లో ఐటెం సాంగ్ అనే చెప్పాలి.

కాగా ఈ సాంగ్ కి అయితే పెద్ద యుద్ధమే నడిచింది అని చెప్పాలి. అల్లు అర్జున్ సుకుమార్ , బన్నీ సినిమాల్లో ఐటెం సాంగ్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే పుష్ప పార్ట్ 2 కి ఎవరితో చేయిస్తారు అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ గా నిలిచింది. ఇపుడు ఫైనల్ గా ఆ సాంగ్ ని శ్రీలీల చేసింది. అయితే ఈమెకి ముందు బాలీవుడ్ టాప్ బ్యూటీ శ్రద్దా కపూర్ పేరు బాగా వినిపించిన సంగతి తెలిసిందే.

after pushpa 2 shraddha kapoor got a big offer in war 2

దాదాపు ఫిక్స్ కూడా అయ్యింది అనుకునే సమయంలో ఆమె ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి చేరింది. కాగా ఇపుడు ఈ బిగ్ ఆఫర్ ని మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్ ఇపుడు ఇండియాస్ మారియో క్రేజీ సీక్వెల్ లో ఆఫర్ పట్టేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అండ్ భారీ సీక్వెల్ చిత్రం "వార్ 2" .

ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అలాగే మన తెలుగు నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు ఒకే రకమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇపుడు ఈ సినిమా లోనే శ్రద్ధా కపూర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. హృతిక్ అలాగే ఎన్టీఆర్ ల కలయికలో ఓ మాస్ అండ్ హాట్ ఐటెం సాంగ్ ఉండగా ఆ పాట కోసం శ్రద్దా కపూర్ ఫైనల్ అయినట్టుగా బీ టౌన్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read more about: shraddha kapoor pushpa 2 war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X