twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లార్గో వించ్ : రెండు ఫ్రీమేక్ లు.. ఇప్పుడు రీమేక్, ఇదేందిదీ!

    |

    సోషల్ మీడియా పరిధి పెరగక ముందు ఒక లెక్క, సోషల్ మీడియా వాడకం పెరిగాక ఒక లెక్క. ఒకప్పుడు ఫలానా సినిమా ఫలానా బాష సినిమాను పోలి ఉంది, లేదా ఫలానా పాట అప్పుడు ఎప్పుడో విన్న పాట ట్యూన్ కు దగ్గరగా ఉంది అనే విషయాలు అంత త్వరగా జనాల్లోకి వెళ్ళేవి కాదు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా పరిధి పెరిగిందో, అప్పుడు ఇలాంటి విషయాలన్నీ క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా ఇతర భాషల సినిమాలను చూసి స్ఫూర్తి పొంది కథను రాసుకుంటూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

    అలా ఒక సినిమాను చూసి స్ఫూర్తి పొంది తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి కాగా మరొకటి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో. ఈ రెండు సినిమాల మీద సదరు ఒరిజినల్ సినిమా దర్శకుడు కాపీ ఆరోపణలు చేశారు కూడా. అదలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమా మా అఫీషియల్గా హిందీలో రీమేక్ కాబోతోంది. ఇంతకీ ఏమిటా సినిమా ఎవరా దర్శకుడు ? అనేది చూస్తే..

    అజ్ఞాతవాసి మొదటి ఫ్రీ మేక్

    అజ్ఞాతవాసి మొదటి ఫ్రీ మేక్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ 'అజ్ఞాతవాసి' సినిమా మీద అప్పట్లో ఓ ఫ్రెంచ్ డైరెక్టర్ తెగ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తన సూపర్ హిట్ ఫిల్మ్ లార్గో వించ్ ను ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వకుండా కాపీ కొట్టేసి అజ్ఞాతవాసి తీశారంటూ దర్శకుడు జెరోమ్ సల్లే ట్విట్టర్ వేదికగా అజ్ఞాతవాసి దర్శకనిర్మాతల మీద ఫైర్ అయ్యాడు. అప్పట్లో ఈ అంశం పెద్ద రచ్చకే దారి తీసింది. అప్పట్లో జెరోమ్‌పై పవన్ ఫ్యాన్స్ కూడా రివర్స్‌ లో ఎటాక్ చేశారు అనుకోండి. అది వేరే విషయం. ఆ వ్యవహారం నెమ్మదిగా సద్దుమణిగింది.

    సాహో రెండో ఫ్రీ మేక్

    సాహో రెండో ఫ్రీ మేక్

    అదే దర్శకుడు మళ్ళీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యాడు. 'సాహో' సినిమా కూడా తన సినిమాకు కాపీనే అంటూ జెరోమ్ వరుస ట్వీట్లు చేశాడు. అంతటితో ఆగకుండా తెలుగు దర్శకులపై సెటైర్లు కూడా వేశాడు. ''లార్గో వించ్ రెండో ఫ్రీమేక్‌ను మొదటిదాని కన్నా చెత్తగా తీశారని అర్థమవుతోంది.

    కాబట్టి, తెలుగు డైరెక్టర్లకి విన్నపం.. మీరు నా పనిని దొంగతనం చేయాలని అనుకుంటే కనీసం దాన్ని సక్రమంగా చేయండి?'' అంటూ జెరోమ్ సెటైర్లు వేసి పరువు తీశాడు. అయితే జెరోమ్ ట్వీట్‌ కు ప్రభాస్ ఫ్యాన్స్‌ కూడా రెస్పాన్స్ గట్టిగానే ఇచ్చారు. తండ్రిని చంపిన వాళ్లపై కొడుకు పగ తీర్చుకునే స్టోరీ లైన్ తో చాలా తెలుగు సినిమాలు వచ్చాయని ఆ విషయం తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు.

    ఇప్పుడు అఫీషియల్ రీమేక్

    ఇప్పుడు అఫీషియల్ రీమేక్

    ఇంత రచ్చకు కారణమైన సదరు సినిమా ఇప్పుడు నిజంగానే రీ మేక్ అవుతోంది. అయితే అది తెలుగులో కాదు హిందీలోకి. చిత్ర నిర్మాత నీరజ్ పాండే మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. రుస్తోమ్ ఫేమ్, టిను సురేష్ దేశాయ్ ఈ సినిమా దర్శకుడుగా వ్యవహరించానున్నారని తెలుస్తోంది. ఇది లార్గో వించ్ యొక్క అధికారిక రీమేక్ అని చెబుతున్నారు. టి-సిరీస్ దగ్గర రీమేక్ రైట్స్ కొనుక్కున్నారని తెలుస్తోంది.

    అప్పట్లోనే హరికా హాసినీ వాళ్ళకు లీగల్ నోటీసులు

    అప్పట్లోనే హరికా హాసినీ వాళ్ళకు లీగల్ నోటీసులు

    నిజానికి టి-సిరీస్ ఈ సినిమా యొక్క రీమేక్ హక్కులను కలిగి ఉంది. అప్పట్లోనే వారు అజ్ఞాతవాసి నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు. ఈ అంశం గురించి పెద్దగా చర్చ అయితే జరగలేదు. ఈ సమస్యను టీ సిరీస్, హారికా హాసినీ వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారో తెలియదు. అయితే దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత, ఈ సినిమా గురించి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

    English summary
    Most of the Telugu audiences are familiar with the French movie Largo Winch. After the release time of Pawan Kalyan’s Agnyathavaasi, the French film became a trending topic on social media. Stating that Agnyathavaasi is a Freemake of Largo Winch, and the director of the original made a fuss about the same back then. Later after release of Prabhas's saaho people compared the story to Largo Winch and took it to the notice of director Jerome Salle. He then made some degragind comments on telugu directors. now reports say filmmaker Neeraj Pandey and Reliance Entertainment are collaborating to produce a film featuring Vidyut Jammwal in the lead role. Rustom fame, Tinu Suresh Desai is the director. It is the official remake of Largo Winch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X