Saaho దెబ్బకు కళ్లు తెరిచిన ప్రభాస్.. తదుపరి సినిమాపై సెన్సేషనల్ డిసీజన్!
బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో వచ్చిన మరో భారీ సినిమా సాహో. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇది గమనించిన ప్రభాస్.. తన తదుపరి సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటున్నారట. ఈ మేరకు ఆయన ఓ సెన్సేషనల్ డిసీజన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఆ వివారాలు చూస్తే..

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్
సాహో సినిమా చేస్తుంటే జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తన తదుపరి సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. చిత్రానికి జాన్ అనే టైటిల్ కంఫర్మ్ చేసినట్లుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఓ నిర్ణయానికి వచ్చారట.

ఇలా అయితే కష్టం అని భావించిన ప్రభాస్
సాహో ఫలితం చూసి ఇలా అయితే కష్టమని భావించిన ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా కోసం తానే స్వయంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు డైరెక్టర్ రాధాకృష్ణకు కొన్ని సూచనలు ఇచ్చారట ప్రభాస్.

మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి రావాల్సిన ప్రభాస్.. ఇప్పుడు
రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న 'జాన్' సినిమా ఇప్పటికే 20 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరపాలని ఫిక్స్ అయ్యారు రాధాకృష్ణ. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ జాయిన్ కావాల్సి ఉంది. అయితే సరిగ్గా ఈ తరుణంలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారట యంగ్ రెబల్ స్టార్.

మార్పులు, చేర్పులు జరిగాకే షూటింగ్
తాను సూచించిన విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేశాకే తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించుదామని ప్రభాస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాధాకృష్ణ కూడా ఆ పనిలో పడ్డారట. సో వీరిద్దరి కాంబోలో వస్తున్న జాన్ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

సాహో ఎఫెక్టే కారణమా..?
తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన సాహో సినిమా.. తెలుగు ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోకపోయినా, హిందీలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకులపై పడిన ఆ ఎఫెక్ట్ తన తదుపరి సినిమా జాన్ ద్వారా చెరిపేయేలాని ప్రభాస్ కృత నిశ్చయంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











