twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    7నెలల తరువాత స్టార్ హీరోల బాక్సాఫీస్ ఫైట్.. ముందు రిస్క్ చేసేదెవరు?

    |

    కరోనా వైరస్ కేసులు ఒకటి రెండు ఉన్నప్పుడు ఎంతగానో భయపడ్డ వారు ఇప్పుడు కేసులు కోట్లు దాటినా రవ్వంతైన ఆందోళన చెందడం లేదని చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. కరోనా పవర్ తగ్గిందా లేక జనాల భయం తగ్గిందా అర్థం కావడం లేదు గాని.. కాలం గడిచిన కొద్దీ బ్రతుకు మీద భరోసా పెరుగుతోంది. ఇక సినిమా థియేటర్లు దాదాపు 7నెలల తరువాత తెరచుకోబోతోన్నాయి. అన్ లాక్ 5లో మళ్ళీ బిగ్ స్క్రీన్ పై పెద్ద హీరోలు దర్శనమివ్వడానికి రెడీ అయ్యారు. ఇక బాక్సాఫీస్ యుద్ధాలు కూడా మొదలు కాబోతున్నాయి.

    పోటీకి సిద్దమైన రవితేజ, రామ్

    పోటీకి సిద్దమైన రవితేజ, రామ్

    అక్టోబర్ 15నుంచి సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్ లు మొదలు కానున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీలో కొందరి నిర్మాతల్లో ఆశలు చిగురించాయి. ఇక వీలైనంత తొందరగా సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద మొదట రవితేజ, రామ్ పోతినేని పోటీ పడేందుకు సిద్దనైనట్లు తెలుస్తోంది.

    క్రాక్.. వచ్చే నెల గ్రాండ్ రిలీజ్

    క్రాక్.. వచ్చే నెల గ్రాండ్ రిలీజ్

    గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన క్రాక్ సినిమా సమ్మర్ మొదట్లోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా ధాటికి వాయిదా వేయక తప్పలేదు. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ నిర్మాతలు టెంప్ట్ అవ్వకుండా ఇన్ని రోజులు చాలా ఓపిక పడ్డారు. ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు. ఇక వచ్చే నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఒక ప్లాన్ వేసుకుంటున్నారు.

    రామ్ రెడ్.. అత్యదిక థియేటర్లలో..

    రామ్ రెడ్.. అత్యదిక థియేటర్లలో..

    ఇక మరోవైపు రామ్ పోతినేని కూడా రెడ్ సినిమాను వచ్చే నెలలోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది. ఇక డబ్బింగ్ పనులను ఇటీవల పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ నెక్స్ట్ ఒక మంచి ట్రైలర్ ని విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటోంది. వచ్చే నెలలో సినిమాను అత్యదిక థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు.

    Recommended Video

    Ravana Lanka Movie Audio Launch
     ముందుగా ఎవరు ఆ రిస్క్ చేస్తారో

    ముందుగా ఎవరు ఆ రిస్క్ చేస్తారో

    అంతా బాగానే ఉంది కానీ థియేటర్స్ కేవలం 50% కెపాసిటీతోనే నడవనున్నాయి. సోషల్ డిస్టెన్స్ కారణంగా పెద్ద సమస్య వచ్చి పడింది. సగం కలెక్షన్స్ తో లాభాలు అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇక గతంలో మాదిరిగా జనాలు థియేటర్స్ వరకు వస్తారా లేదా అనేది మరొక బిగ్ సస్పెన్స్. ముందుగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలైతే గాని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియదు. మరి ముందుగా ఎవరు ఆ రిస్క్ చేస్తారో చూడాలి..

    English summary
    There is no doubt that in the coming days, the OTT will be increasing in the film industry. Now a corollary for that matter has been a lot of people. They are coming to a decision that it would be better if all the films that are ready for release are released in OTT at the lowest possible rate. Others do not even accept how many offers are coming.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X