ప్రభాస్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు తెలుగు స్టార్ డైరెక్టర్ జంప్.. అక్కడేం చేస్తాడో?
టాలీవుడ్ లో ఒక హిట్ కొట్టడం.. ఆ తరువాత బాలీవుడ్ కు జంప్ అవ్వడం కేవలం హీరోలకు, హీరోయిన్లకే కాదు.. డైరెక్టర్స్ కూడా వర్తిస్తుంది.
డైరెక్టర్ మారుతీ.. ఈరోజుల్లో సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మారుతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బస్ స్టాప్ కొత్త జంట వంటి యూత్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు . ఆ తరువాత భలే భలే మగాడివోయ్,బాబు బంగారం, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు,ప్రతీరోజూ పండగే లాంటి సినిమాలు చేశాడు. విజయాపజయాలను పక్కన పెడితే మంచి అవకాశాలనే అందుకున్నాడు.

ఇక ప్రస్తుతం మారుతి .. ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. దీనికోసం మారుతి బాగానే కష్టపడుతున్నాడు. నిజం చెప్పాలంటే ప్రతిరోజు పండగే సినిమా తరువాత మారుతి కి గ్యాప్ వచ్చింది. అసలు చాలామంది మారుతి ఉన్నాడనే విషయమే మర్చిపోయారు. అలాంటి సమయంలో మారుతి .. ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అని టాక్ రాగానే.. ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు. చాలా రోజులు అసలు ఈ సినిమా గురించి ఎవరు నోరు విప్పింది లేదు.
ఇక సడెన్ గా ఒకరోజు మారుతి.. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. సలార్ కన్నా ముందే ఈ సినిమా కోసం డార్లింగ్ తో ట్రావెల్ అవుతున్నట్లు తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. అప్పటికే ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలను కమిట్ అయ్యి ఉన్నాడు. మధ్యలో ఈ సినిమా అంటే అందరూ షాక్ అయ్యారు. చిన్న సినిమాగా మొదలైన మారుతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ప్రభ్స్- మారుతి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా రాజాసాబ్.
ఇక ఇప్పటివరకు ప్రభాస్ ను మాస్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ కు మారుతి చిన్న చేంజ్ ఇచ్చాడు. క్లాస్ లుక్ లో ప్రభాస్ కనిపించేసరికి అందరి చూపు రాజాసాబ్ మీదనే పడింది. ఇన్నాళ్లు ఎంటర్టైనర్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన మారుతి ఈసారి తన రేంజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఈ సినిమా పోస్టర్ చూసినప్పుడే ఫ్యాన్స్ కు అర్థమైంది. ఈ నేపథ్యంలోనే మారుతి రాజాసాబ్ తరువాత బాలీవుడ్ కు వెళ్లే ప్లాన్ కూడా సెట్ చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

టాలీవుడ్ లో ఒక హిట్ కొట్టడం.. ఆ తరువాత బాలీవుడ్ కు జంప్ అవ్వడం కేవలం హీరోలకు, హీరోయిన్లకే కాదు.. డైరెక్టర్స్ కూడా వర్తిస్తుంది. అలా ఇప్పటివరకు చాలామందే వెళ్లారు. అక్కడ హిట్ అందడం, అందక పోవడం వారి ఇష్టం. కానీ, బాలీవుడ్ కు అయితే వెళ్లి తమ రేంజ్ ను పెంచుకోవడానికి మాత్రం బాగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అదే పని మారుతి కూడా చేస్తున్నాడని అంటున్నారు.
రాజా సాబ్ అనుకున్న అంచనాలను అందుకుంటే మాత్రం మారుతి నెక్స్ట్ సినిమా కూడా ఉంటే బాలీవుడ్ హీరోతో చేసేయొచ్చు లేదా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు. అది కాకా.. రాజాసాబ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో కూడా తెలియదు. మరి ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాలి. అప్పటిలోగా మారుతి ఈ సినిమాపైనే ఫోకస్ చేస్తాడో లేకపోతే బాలీవుడ్ లో ట్రైల్స్ వేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











