త్రివిక్రమ్, సుకుమార్ తర్వాత తమిళ క్రేజీ డైరెక్టర్.. అంతా బన్నీ కోసమే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. గత ఏడాది మేలో నా పేరు సూర్య చిత్రం విడుదలై నిరాశపరిచింది. ఇటీవల బన్నీ తన కొత్త చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఉంటుందని ప్రకటించాడు. ఈ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఒక్క సారిగా జోరు పెంచాడు. త్రివిక్రమ్ చిత్రం తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ ని బన్నీ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మురుగదాస్ దర్శత్వంలో
తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తమిళ దర్శకులతో వర్క్ చేయాలనీ ప్రయత్నం ఇప్పటిది కాదు. కొన్నేళ్ళ క్రితమే లింగుస్వామి దర్శత్వంలో అల్లు అర్జున్ నటించాల్సింది. గ్రీన్ స్టూడియోస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.

తెలుగులో నిరాశ
తాజాగా అల్లు అర్జున్, మురుగదాస్ చిత్రానికి సంబంధించిన వార్తలు వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. మురుగదాస్ చాలా కాలం తర్వాత తెలుగులో తెరకెక్కించిన మహేష్ బాబు స్పైడర్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత తమిళంలో విజయ్ తో సర్కార్ చిత్రాన్ని రూపొందించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఎలాంటి చిత్రం చేస్తాడో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

సూపర్ స్టార్ రజనీతో
ప్రస్తుతం మురుగదాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో మురుగదాస్ రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ లోపు బన్నీ కూడా త్రివిక్రమ్, సుకుమార్ చిత్రాల్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాతే బన్నీ, మురుగదాస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మురుగదాస్ నేరుగా తెలుగులో స్టాలిన్, స్పైడర్ చిత్రాలని తెరక్కించారు. మురుగదాస్ చిత్రాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.

విభిన్నమైన కథలు
మురుగదాస్ చిత్రాలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఏదోఒక ప్రత్యేక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ ఈ దర్శకుడు కథ అల్లుకుంటాడు. గజినీ, తుపాకీ, సర్కార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని మురుగదాస్ రూపొందించారు. బన్నీతో తెరకెక్కించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్, సుకుమార్, మురుగదాస్ ఇలా క్రేజీ దర్శకులంతా బన్నీ కోసం క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











