ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ ప్లాన్ ఏంటి? నెక్ట్స్ హీరో ఎవరు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, హరీష్ శంకర్ టేకింగ్ అన్ని కలిసి థియేటర్లలో మాస్ ఫీస్ట్‌గా నిలిచాయి. ఈ తరుణంలో హరీష్ శంకర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూస్తే.. విడుదలైన మొదటి రోజే రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించి మంచి ఓపెనింగ్ అందుకుంది. తరువాతి రోజుల్లో కొంత డ్రాప్ కనిపించినా, మూడో రోజుకల్లా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. మూడో రోజు సుమారు రూ.9.15 కోట్ల నెట్ కలెక్షన్ రావడంతో మొత్తం వసూళ్లు రూ.52.90 కోట్లకు చేరాయి.

After Ustaad Bhagat Singh What s Next for Harish Shankar Chiranjeevi or Pawan Kalyan Again

ముఖ్యంగా ఈవెనింగ్, నైట్ షోలలో ఆక్యుపెన్సీ పెరగడం, సినిమా మీద పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉందని సూచిస్తోంది. ఇక సినిమా సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరై, పవన్ కళ్యాణ్ నటనతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వాన్ని ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఇది చిత్ర యూనిట్‌కు మరింత బూస్ట్ ఇచ్చినట్లే.

ఇక హరీష్ శంకర్ కెరీర్ విషయానికి వస్తే, తక్కువ సినిమాలే చేసినా స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్‌తో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో కీలక మలుపు తిప్పిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో వచ్చిన నెగిటివిటీని 'ఉస్తాద్ భగత్ సింగ్' ద్వారా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్రాసెస్‌లో ఉందని క్లారిటీ ఇచ్చారు. 'రౌడీ అల్లుడు', 'దొంగ మొగుడు', 'గ్యాంగ్ లీడర్' తరహాలో పూర్తి మాస్ ఎంటర్టైనర్‌ను చిరంజీవితో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చిరంజీవిని పలుమార్లు కలిసి కథ గురించి చర్చలు జరిపినట్లు కూడా వెల్లడించారు.

ఈ ప్రకటనతో 'ఉస్తాద్' తర్వాత హరీష్ శంకర్-చిరంజీవి కాంబో ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరందుకుంది.గతంలో చిరంజీవితో యాడ్ షూట్ చేసిన సమయంలోనే హరీష్‌కు మంచి అభినందనలు లభించాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకులతో వరుస ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, హరీష్ శంకర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈసారి కథ మరింత కొత్తగా, కేవలం ఫ్యాన్స్‌కే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. దీంతో ఈ కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం మీద చూస్తే, 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తరువాత హరీష్ శంకర్ ముందు భారీ ఆప్షన్లు ఉన్నాయి. చిరంజీవితో మాస్ ప్రాజెక్ట్ లేదా మరోసారి పవన్ కళ్యాణ్‌తో కాంబో. ఈ రెండు ప్రాజెక్ట్‌లలో ఏది ముందుగా వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X