వారణాసి తర్వాత రాజమౌళి మాస్టర్ ప్లాన్ అదేనా?
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ గ్లోబల్ ఎపిక్ మూవీ వారణాసి( Varanasi). భారీ అంచనాల నడుమ విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వస్తుంది. నందీశ్వరుడి కాన్సెప్ట్ చుట్టూ నడిచిన ఈ స్పెషల్ యాక్షన్ విజువల్స్ మహేష్‌ను న్యూ యాంగిల్‌లో చూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉండగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ వర్డల్ మూవీ తరువాత రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను మహా భారతం తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ కథేంటీ?
వారణాసి మూవీ టైటిల్ రీలీజ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్‌తోపాటు భారీ ఐమ్యాక్స్ స్క్రీన్ వేసి యూనిట్ భారీ ఏర్పాట్లు చేసిందని ఇండస్ట్రీ టాక్. అయితే, లాంచ్ సమయానికి సాంకేతిక లోపాల కారణంగా గ్లింప్స్ ఆలస్యమవ్వడంతో రాజమౌళి, మహేష్ అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. చివరకు ఆన్‌లైన్ ద్వారా విడుదల కాగా, ఫ్యాన్స్ స్పందన మాత్రం హిస్టీరికల్‌గా మారింది. ఈ వేడుకలో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలూ పెద్ద చర్చకు దారి తీసాయి. టైటిల్ విడుదల ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేస్తూ "దేవుడిపై పెద్ద నమ్మకం లేదు!" అన్న రాజమౌళి మాటలు వివాదాస్పదంగా మారాయి.

ఏదిఏమైనా ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా వారణాసి కోసం రాజమౌళి గ్లోబల్ స్థాయిలో మార్కెట్ ప్లానింగ్ చేస్తున్నారట. ఈ మూవీలో హాలీవుడ్ టెక్నీషియన్లు, పాన్ ఇండియా-పాన్ వరల్డ్ క్యాస్టింగ్, మైథాలజికల్ ఎలిమెంట్స్ అన్ని కలిసి వారణాసి మూవీని వర్డల్‌వైడ్ గా చర్చనీయంగా మార్చేశాయి. అలాగే.. హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడం, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకోవడం, ఇప్పటికే కీరవాణి స్వరపరిచిన 'సంచారి' పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలవడం, రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెంచాయి.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ బజ్ వైరల్ మారింది. వారణాసి మూవీ తరువాత రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే అవకాశముందట. ఈ విషయాన్ని బాహుబలి-2 సమయంలోనే చెప్పారు. మహాభారతం తీసే ఆలోచన ఉందని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే.
రాజమౌళి గత ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ 'మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఒక్క సినిమాలో చేయడం అసాధ్యం. 2-3 పార్ట్స్‌లో రావాలి. దానికి సరైన సమయం, సరైన హీరో, సరైన టీమ్ కావాలి' అన్నారు. అయితే, ఆర్.ఆర్.ఆర్ తరువాత ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరాశలో పడ్డారు.
ఇటీవల వారణాసి ఈవెంట్‌లో మళ్లీ మహాభారతంపై సినిమా తీయాలన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో బాండింగ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి గ్లోబల్ స్టార్స్‌తో పనిచేస్తున్న అనుభవం. అలాగే.. ఈ సినిమాలో రామాయణ ఘట్టం ఆధారంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ రూపొందించామని, అందులో మహేష్ బాబు శ్రీరాముడుగా కనిపిస్తారని రాజమౌళి వెల్లడించారు. థియేటర్లలో ఆ ఎపిసోడ్ భారీగా స్పందన తెస్తుందన్న నమ్మకం ఆయన వ్యక్తం చేశారు.
ఈ మాటలతో మహేష్ లుక్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ పై కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి. మహాభారతం వ్యాఖ్యలతో భవిష్యత్తులో ఏమి ప్లాన్ చేస్తున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. జక్కన్న తదుపరి ప్రణాళికలు ఏవో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా వారణాసి పూర్తయిన తరువాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తెరకెక్కించబోతున్నారు? అనేది రూమార్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది. చూడాలి ఎలాంటి అప్డేట్ వస్తుందో .


Click it and Unblock the Notifications











