విశ్వక్ సేన్ తప్పుకోవడంతో ఆ హీరో కోసం ట్రై చేస్తున్న అర్జున్.. న్యూ కాంబినేషన్!
హీరో విశ్వక్ సేన్, అర్జున్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే విశ్వక్ తీరు కారణంగా అర్జున్ అతనిని తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. వీరి మధ్య జరిగిన గొడవ ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఒక విధంగా విశ్వక్సేన్ తప్పుకున్నట్లు కూడా కొందరు సినీ ప్రముఖులు కామెంట్ చేశారు. అయితే విశ్వక్ తప్పుకోవడంతో అర్జున్ మరొక హీరోతో సినిమా చేసి వీలైనంత తొందరగా ఆగిన ప్రాజెక్ట్ ను రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక హీరో ఎవరు అనే విషయంలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ విషయంలో హార్ట్ అయిన అర్జున్
విశ్వక్ సేన్ ఊహించిన విధంగా తీసుకున్న నిర్ణయంపై అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినిమా మాటలు, పాటల విషయంలో కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది అనే విషయం కోసం ఒకరోజు షూటింగ్ ఆపేద్దాము అని చెప్పడంతో అర్జున్ ఆ విషయంలో తీవ్రంగా హర్ట్ అయ్యారు.

భిన్నాభిప్రాయాలు
అయితే ముందుగా కథ చేయడానికి ఒప్పుకున్న తర్వాత హీరోలు ఆ విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అని మరి కొందరు సీనియర్ దర్శకనిర్మాతలు కామెంట్ చేశారు. ఒక విధంగా ఇది ప్రతి దర్శకనిర్మాతలు ఎదుర్కొంటున్నారు అని కొంతమంది హీరోలు అనవసరంగా కథల విషయంలో భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అని దర్శకులకు నిర్మాతలకు ఫ్రీడం లేకుండా పోయింది అని కూడా అంటున్నారు.

మిగతా వాళ్ళు చెప్పుకోలేని
ఇక దర్శక నిర్మాతల కష్టాలు ఎలా ఉంటాయో అర్జున్ చెప్పుకున్నాడు మిగతా వాళ్ళు చెప్పుకోలేని కూడా మరి కొందరు చెబుతున్నారు. అయితే హీరో విశ్వక్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే దర్శకుడు అర్జున్ ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

శర్వా కోసం అర్జున్ ప్రయత్నం
ఇక మళ్ళీ అర్జున్ తెలుగు హీరో వైపే ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లిస్టులో చాలామంది పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడిగా అర్జున్ అయితే మంచి కమిట్మెంట్ ఉన్న మరొక నటుడు శర్వానంద్ అయితే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న అర్జున్ కొన్ని సాంగ్స్ ను కూడా ఫైనల్ చేశారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తూ ఉండగా ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర మాటలు అందించారు.

శర్వా ఒప్పుకుంటాడా?
త్వరలోనే శర్వాకు పూర్తి స్థాయిలో కథ చెప్పి ఒప్పించాలని అర్జున్ అనుకుంటున్నాడట. ఇక శర్వానంద్ కూడా విభిన్నమైన కథలు చేయాలని ఆలోచిస్తున్నాడు. గత కొంతకాలంగా అతను కూడా సక్సెస్ లు లేక కొంత సతమతమయ్యాడు. రీసెంట్ గా ఒకే ఒక జీవితం మాత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. మరి విశ్వక్ వదిలేసిన ప్రాజెక్టును అతను చేస్తాడో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











