Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మొదటి సినిమా... హీరో, దర్శకుడు ఎవరంటే?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలు. నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు చేయదు అంటూ వార్తలు వచ్చాయి. సినిమాలకు లావణ్య పుల్ స్టాప్ పెట్టేసి... మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చేపట్టనుందని అన్నారు. అయితే లావణ్య ఇప్పుడు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఆ దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుందట. ఆ సినిమాలో హీరో ఎవరు.. దర్శకుడు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దిల్లీ భామ లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా కోడలు అయిపోయింది. ఆరు ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ సీక్రెట్ గా లవ్ చేసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య. ఇక వీరి ప్రేమను ఇంట్లో చెప్పి... అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇటలీలో నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి జరిగింది. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీ హాజరు అయ్యారు. ఇక ఇండస్ట్రీలోని అతి కొద్ది మంది సన్నీహితులు హాజరు అయ్యారు.

ఇక ఇటలీలో పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ రిసెప్షన్ కు ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరు అయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక వీరి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇటీవల లావణ్య తన పెళ్లి ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయిపోయింది. ఇక మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చేపడతూ బిజీ అయిపోయింది లావణ్య. ఇటూ వరుణ్ తేజ్ కూడా తన సినిమా షూటింగ్స్ బిజీలో ఉన్నాడు.
ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి.. సినిమాలు చేయదు అనుకున్నారు. ఇక మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ... ఇంటి పనులు చూసుకుంటుందని టాక్ వచ్చింది. ఇక సినిమాలు మానేసి అక్క ఉపాసన మాదిరి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక లావణ్య సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసిందనే అంతా అనుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది.

లావణ్య త్రిపాఠి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుందట. ఈ క్రమంలోనే ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తెరకెక్కించే శివ నిర్వణ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ఓ సినిమా చేయబోతుందని తెలుస్తోంది. నిన్నుకోరి, మజిలీ, ఖుషి లాంటి ఫిల్ గుడ్ లవ్ స్టోరిలో లావణ్య త్రిపాఠి నటించనుందట. ఓ ప్రేమకథ చిత్రాన్ని తెరకెక్కించాలని శివనిర్వాణ ప్లాన్. ఇప్పటికే ఈ సిినిమాకు లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

దానికి కారణం ఈ సినిమాలో నటించే హీరోను చూసే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇక ఈసినిమాలో హీరోగా చేయబోయేది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని తెలుస్తోంది. ఈ కొత్త జంటను పెట్టి శివ నిర్వాణ ఓ క్యూ్ట్ లవ్ స్టోరీని ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











