ప్రభాస్ తో బాలీవుడ్ హాట్ హీరోయిన్ మరోసారి!

అటు నార్త్ సినిమా నుంచి వచ్చి తెలుగు సినిమాలో సహా సౌత్ సినిమా దగ్గర సంచలనం రేపిన హాట్ బ్యూటీస్ చాలా మందే ప్రస్తుతం కనిపిస్తారు. కాగా మన నుంచి అక్కడకి వెళ్లిన హీరోయిన్స్ కి ఏమో కానీ అక్కడ నుంచి మన దగ్గరకి వచ్చిన హీరోయిన్స్ ని మాత్రం మన ఆడియెన్స్ నిర్మాతలు బాగానే ఆదరిస్తారని చెప్పవచ్చు.

కాగా ఇలా హిందీ సినిమా నుంచి తెలుగులో వచ్చి అదరగొట్టిన సెన్సేషనల్ హాట్ బ్యూటీస్ లో హాట్ బాంబ్ దిశా పటాని కూడా ఒకామె అని చెప్పవచ్చు. కాగా తెలుగులో దర్శకుడు పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచే పరిచయం అయ్యిన దిశా పటాని ఇపుడు ఇండియా లోనే మోస్ట్ హాట్ హీరోయిన్స్ లో ఒకామెగా నిలిచింది. కాగా దిశా పటాని హీరోయిన్ గా ఇపుడు సౌత్ లో చాలా సినిమాలు చేసింది.

again bollywood hot bomb disha patani for prabhas in this biggie

గత ఏడాది లోనే తన నుంచి రెండు సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో నటించిన కల్కి 2898 ఎడి కూడా ఒకటి ఈ సినిమాతో మొదటి సారిగా ప్రభాస్ సరసన రొమాన్స్ చేసిన ఈ హాట్ బ్యూటీ ఆ సినిమాలో తన స్క్రీన్ స్పేస్ తక్కువ సేపే ఉన్నప్పటికీ తన హాట్నెస్ తో మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత పార్ట్ 2 లో ఆమె ఉంటుందో లేదో అనేది ప్రస్తుతానికి సందేహమే కానీ ఈ సినిమా కాకుండా మరో సినిమాలో మరోసారి ప్రభాస్ తో కనిపించే ఛాన్స్ ని ఈమె కొట్టేసినట్టుగా ఇపుడు టాలీవుడ్ లో కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ రూమర్స్ ప్రకారం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఒకటైన దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న పీరియాడిక్ సినిమాలో ఆమె నటిస్తుంది అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఆల్రెడీ యువ హీరోయిన్ ఇమాన్విని ప్రభాస్ కోసం మేకర్స్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈమె కాకుండా దిశా పటాని లాంటి బ్యూటీని కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆమె కూడా ఫీమేల్ లీడ్ లో ఉంటుంది అని అనుకోవచ్చు కానీ ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం దిశా పటాని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో మాత్రం కనిపిస్తుందట.

దర్శకుడు హను రాఘవపూడి ఆమెకి ఒక స్పెషల్ రోల్ ని డిజైన్ చేసారని అందుకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని ఈ హాట్ బ్యూటీని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దిశా పటాని మళ్ళీ ప్రభాస్ సరసన కనిపిస్తుందో లేదో అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా మాత్రమే కాకుండా ది రాజా సాబ్ అలానే సలార్ 2 ఇంకా కల్కి పార్ట్ 2 తో పాటుగా మరిన్ని సినిమాలు లైనప్ లో పెట్టుకొని ఫ్యూచర్ లో చాలా బిజీగా కనిపించనున్నాడు. వీటిలో ది రాజా సాబ్ ఒకటి ఈ ఏడాదిలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Read more about: prabhas disha patani prabhas hanu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X