బాలకృష్ణ వచ్చిన ప్రతిసారి పోటికి వస్తున్నఆ హీరో..!?
బాలకృష్ణ, రవితేజల మధ్య మీరా జాస్మిన్ చిచ్చు పెట్టిందనేది జనమంతా నిజమని నమ్మే గాసిప్. సదరు పుకారుని ఇరువురూ ఖండించినా కానీ ఇంకా అదే నిజమని జనం కన్వీనియెంట్ గా నమ్మేస్తున్నారు. అయితే వ్యక్తిగత వైరం సంగతి మాటెలా ఉన్నా వృత్తి పరంగా ఇద్దరి మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. కావాలని విడుదల చేయకపోయినా, బాలకృష్ణ సినిమా వచ్చిన ప్రతిసారి పోటీగా రవితేజ సినిమా కూడా ఉంటోంది.
ఒక్కమగాడు వచ్చినప్పుడు రవితేజ నటించిన కృష్ణ, మిరపకాయ్ తో పాటు బాలకృష్ణ 'పరమవీర చక్ర" విడుదలై బాలయ్య సినిమాల్ని రవితేజ చిత్రాలు దారుణంగా దెబ్బతీశాయి. మరోసారి బాలయ్యతో అమీ తుమీకి రవితేజ సిద్దపడుతున్నాడు. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'అధినాయకుడు". ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు మూడు వేషాలలో కనపడనున్నారు. సలోని మరియు లక్ష్మీ రాయ్ ఈ చిత్రం లో ప్రధాన హీరోయిన్లు. ఈ నెల 26 నుండి బాలకృష్ణ మరియు లక్ష్మీరాయ్ ల మీద హైదరాబాద్ లో ఒక పాత చిత్రీకరించనున్నారు. పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. బాలకృష్ణ వేసిన పెద్దాయన వేషం మంచి హైలైట్ అవుతుందని దర్శకులు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ బాలకృష్ణకు బాగా కలిసొచ్చిన పండుగ. అందుకే ఈ సారి అధినాయకుడి మీద ఫాన్స్ లో మంచి ఆశలు ఉన్నాయి. ఈసారి అధినాయకుడు సినిమాకి పోటీగా రవితేజ 'నిప్పు" చిత్రం విడుదలవుతోంది. ఈసారైనా బాలయ్య లెక్క సెటిల్ చేసేస్తాడో లేక రవితేజకి తనపై హిట్ల హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ కట్టబెట్టేస్తాడో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











