మళ్ళీ బుక్కయ్యిన జానీ మాస్టర్? ఈసారి చరణ్ విషయంలోనా?
ఒకప్పుడు మన సినిమాల్లో హీరోలు అంటే డెఫినెట్‌గా క్రేజీ డాన్స్ మూమెంట్స్ లాంటివి ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలైన డాన్స్ ట్రెండ్‌లో తన కుటుంబం నుంచి వచ్చిన వారసులు అంతా కూడా మంచి డాన్స్ లు నేర్చుకొనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరికీ మేజర్‌గా తమ డాన్స్ మూమెంట్స్ మాత్రమే మాస్ ఆడియెన్స్‌లోకి మరింత దూసుకెళ్లేందుకు దోహదపడ్డాయి.
మెగా హీరోస్ ఓ డాన్స్ మాస్టర్ ని లేదా కొరియోగ్రాఫర్ ని నమ్మితే వారికి వరుస అవకాశాలు ఇస్తూ వస్తుంటారని తెలిసిందే. అలా చిరు సమయంలో లారెన్స్ ఇతర మాస్టర్స్ ఉంటే ఇపుడు చిరు వారసుడు రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల ట్రెండ్‌లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌ల పేర్లు తరచుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ అయితే మెగా కుటుంబానికి మరింత దగ్గర అయ్యారని చెప్పొచ్చు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా తాను వీరాభిమాని కాగా సినిమాలో మాత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తనకి ఇచ్చిన అవకాశాల మూలానే ఈ స్టేజికి వచ్చానని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు జానీ మాస్టర్. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి కూడా క్రేజీ సాంగ్స్ అండ్ మూమెంట్స్ ని ఇచ్చాడు జానీ. కానీ ఇటీవల పరిస్థితులు తారు కావడంతో అల్లు అర్జున్‌కి జానీ మాస్టర్‌కి దూరం పెరిగింది.
ఇలా జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల్లో జైలుకి వెళ్ళడం.. మళ్ళీ తాను బయటకి రావడం, వచ్చాక అల్లు అర్జున్ వ్యవహారంపై మాట్లాడకపోవడం వంటివి చాలానే నెగిటివ్ అంశాలు జానీ మాస్టర్ ని బుక్ చేసాయి. ఇపుడు ఇవి కాకుండా తన డాన్స్ కొరియోగ్రాఫ్ విషయంలో జానీ మాస్టర్‌కు ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా ఇన్నేళ్ల కెరీర్‌లో జానీ మాస్టర్ ఓ సాంగ్‌కి డాన్స్ మూమెంట్స్ కాపీ కొట్టారని కానీ, ఇతర భాషల్లో వీడియోస్‌లో చూసి మన హీరోలకి కంపోజ్ చేయడం కానీ చేసింది లేదు. బట్ ఇపుడు సోషల్ మీడియాలో మాత్రం ఓ క్లిప్ వైరల్‌గా మారింది. దీనితో రీసెంట్‌గా తాను రామ్ చరణ్ కోసం కంపోజ్ చేసిన గేమ్ ఛేంజర్‌లోని దోప్ సాంగ్ స్టెప్పులను మరో సాంగ్ నుంచి కాపీ కొట్టినట్లుగా నెట్టింట కొన్ని వీడియోలై ట్రెండ్ అవుతున్నాయి.
సినిమాలో సెట్టింగ్స్ కూడా కాపీనే అంటూ ఓ వీడియో వైరల్ చేస్తూ జానీ మాస్టర్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు . దీనిపై జానీ మాస్టర్ స్వయంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే తాను కాపీ కొట్టాడని అంటున్నారో ఆ విజువల్ కూడా జానీ మాస్టర్‌కి చెందినదే. అదే గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి యూనిట్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోనే , వేరే వీడియో అంటూ జానీ మాస్టర్ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో తన క్యారెక్టర్ పరంగా కామెంట్స్ ఏమో కానీ తన టాలెంట్ విషయంలో మాత్రం జానీ మాస్టర్ వైపు ఎలాంటి తప్పు లేదని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











