సుకుమార్ కు మళ్లీ మొండి చెయ్యేనా?
హైదరాబాద్: 1 నేనొక్కిడినే చిత్రం ముందు ఉన్న క్రేజ్ సుకుమార్ కు హీరోల్లో తగ్గింది. అందరూ సినిమాని మెచ్చుకునేవారే కానీ పిలిచి సినిమా ఇచ్చేవారు కరువయ్యారు. సినిమాని ఎక్కువ రోజులు తీస్తాడని, ఓవర్ బడ్జెట్ అవుతుందని, రికవరీ ఎంతవరకూ తేలక రిస్క్ ఎక్కువ ఉంటుందని ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు భావిస్తూండటంతో ఇమ్మిడియట్ గా ప్రాజెక్టుని ప్రారంభించలేకపోయారు.
1 నేనొక్కిడినే సమయంలో ఆయన దగ్గర ఓ ఇంటిలిజెంట్ లవ్ స్టోరీ ఉందని, దాంతో ఎన్టీఆర్ ని ఒప్పించాడని వార్తలు వచ్చాయి. అయితే సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ కావటంతో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన రభస చిత్రం సైతం ఫ్లాపు అవటంతో...మళ్లీ ఎన్టీఆర్ పిలిచి సుకుమార్ కు అవకాసం ఇచ్చాడని వినపడింది. ప్రముఖ నిర్మాత బివియన్ ఎస్ ప్రసాద్ కుమారుడు బాపినీడు కు ఎన్టీఆర్ కు ఉన్న సాన్నిహిత్యంతో రిలియన్స్ వారు అండతో ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని చెప్పుకున్నారు.

అయితే సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఈ సారి కూడా సుకుమార్ కు మొండిచెయ్యే కనపడేటట్లు ఉంది. క్రిష్ తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారని వార్తలు వస్తున్న నేపధ్యంలో సుకుమార్ ప్రాజెక్టు లేనట్లే అని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్..పూరీ జగన్నాథ్ తో నేనో రకం టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఆంధ్రావాలా తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ అథికారిగా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











