అల్లు అర్జున్ కంటే ముందు మరో యువ హీరోతో ఏజెంట్ దర్శకుడు.. న్యూ ప్రాజెక్ట్!
కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అతి కొద్ది మందిలో సురేందర్ రెడ్డి కూడా ఒకరు. అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సురేందర్ రెడ్డి కళ్యాణ్ రామ్ కి కెరియర్ లో మొదటి సక్సెస్ ఇచ్చాడు. తరువాత ఎన్టీఆర్ తో అశోక్ చేసి హిట్ కొట్టాడు. మహేష్ బాబుకి అతిథితో ఫ్లాప్ ఇచ్చాడు.
రెండేళ్ళ తర్వాత రవితేజతో కిక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ గ్రాండ్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టి 18 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ళలో అతను చేసినవి 10 సినిమాలు మాత్రమే. వీటిలో ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా మూడు డిజాస్టర్ చిత్రాలు ఉన్నాయి. అన్నింటిలోకి బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే ఏజెంట్ అని చెప్పాలి.

80 కోట్ల తో తీసిన ఈ మూవీ 10 శాతం కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీ ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తయితే దర్శకుడిగా అతని ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసింది. అయితే పడిన ప్రతిసారి మరింత బలంగా తనని తాను ప్రూవ్ చేసుకోవడం సురేందర్ రెడ్డి స్టైల్. ఏజెంట్ హిట్ అయ్యి ఉంటే వెంటనే అల్లు అర్జున్ తో మూవీ ఎనౌన్స్ చేయాలని సురేందర్ రెడ్డి అనుకున్నారు.

ఇప్పటికే పవన్ హీరోగా సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యి ఉంది. అయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. ఏజెంట్ ఫ్లాప్ కారణంగా స్టార్ట్ అవుతుందో లేదో అనే సందేహం వస్తోంది. అయితే ఈ లోపు నితిన్ హీరోగా ఒక సినిమా చేసి హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సురేందర్ రెడ్డికి ఎక్కువగా వక్కంతం వంశీ కథలు రాస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే దర్శకుడితో నితిన్ మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డికి నితిన్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఫామ్ లోకి రావడానికి సపోర్ట్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నితిన్ తో హిట్ కొడితే అప్పుడు అల్లు అర్జున్ సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











