అజ్ఞాతవాసి ఆడియోకు వారిని పిలువొద్దు.. తేల్చి చెప్పిన పవన్.. అందుకే చిరు రావడం లేదట...
Recommended Video

ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పరుగులు పెడుతున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 19న హైదరాబాద్‌లో జరుగనున్నది. ఈ కార్యక్రమానికి భారీగా ప్రేక్షకులు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ హెచ్చరించినట్టు సమాచారం.

కొంతమందినే పిలుద్దాం
గతంలో జరిగిన ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చోటుచేసుకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అతికొద్ది మందిని మాత్రమే పిలువాలి అని పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఫ్యాన్స్‌కు మాత్రమే ఆహ్వానం
ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు అభిమానులను మాత్రమే పిలువాలి అని పవన్ కల్యాణ్ సూచించారట. ఆడియో ఆవిష్కరణ జరిగే సభావేదికలో పట్టే విధంగా ఆహ్వానాలను పంపాలని, ఇన్విటేషన్ కార్డులను ముద్రించాలిని సూచించారట.

బయట వ్యక్తులను పిలువొద్దు
సినిమాకు సంబంధం లేని వారిని, బయట వ్యక్తులను అజ్ఞాతవాసి ఆడియోకు పిలువకూడదు. చిత్ర యూనిట్ సభ్యులు, ఫ్యాన్స్ మధ్యనే నిరాడంబరంగా జరుగాలి అని పవన్ తేల్చి చెప్పారట. నగరంలో భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుకుండా చూసుకోవాలని తన సన్నిహితులకు చెప్పినట్టు తెలిసింది.

చిరంజీవి రావడం..
ఇక అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ఫంక్షన్‌కు చిరంజీవి రావడం లేదనేది చిత్ర యూనిట్ వెల్లడించింది. వ్యక్తిగత కారణాలు, ముందస్తు అపాయింట్‌మెంట్ కారణాల వల్లనే చిరంజీవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

ముఖ్య అతిథిగా వెంకటేష్
ఇక చిరంజీవి స్థానంలో ముఖ్య అతిథిగా వెంకటేష్ వస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైటెక్స్‌లో డిసెంబర్ 16న జరుగునున్నది.


Click it and Unblock the Notifications











