షాకింగ్: ‘అజ్ఞాతవాసి’పై కాపీ వివాదం? రంగంలోకి హీరో రానా?
మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సినిమాను అనుకోని వివాదం చుట్టుముట్టినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కాపీరైట్ ఇష్యూ వచ్చిందని, టీ సిరీస్ సంస్థ నుండి దర్శక నిర్మాతలకు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని సెట్ చేసేందుకు హీరో రానా రంగంలోకి దిగారట.

ఫ్రెంచి సినిమాకు కాపీనా?
ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్' అనే సినిమా స్పూర్తితో ‘అజ్ఞాతవాసి' తెరకెక్కించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ‘టి-సిరీస్' అలర్ట్ అయిందని, ఆ ఫ్రెంచి మూవీ హిందీ రీమేక్ రైట్స్ ఈ సంస్థ దక్కించుకోవడంతో.... ఈ వార్తలు విని ఉలిక్కి పడిందని అంటున్నారు.

దర్శక నిర్మాతల మౌనం
‘అజ్ఞాతవాసి' సినిమా ఫ్రెంచి సినిమాకు కాపీ అని ప్రచారం జరుగుతున్నా.... నిర్మాత చినబాబుగానీ, దర్శకుడు త్రివిక్రమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు, ఖండించలేదు. వీరి మౌనం కూడా ‘టి-సిరీస్' యాజమాన్యంలో అనుమానాన్ని మరింత పెంచిందట.

సెన్సార్ కాపీ అడిగిన టి సిరీస్
ఈ విషయంలో టి సిరీస్ సంస్థ చాలా లేటుగా మేల్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు పంపిన నోటీసుల్లో తమకు ‘అజ్ఞాతవాసి' సెన్సార్ కాపీ చూపించాలని, తాము రైట్స్ దక్కించుకున్న సినిమాకు కాపీ అవునో? కాదో ఒకసారి చెక్ చేసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

రంగంలోకి రానా
ఈ కాపీ వివాదం నేపథ్యంలో హీరో రానా రంగంలోకి దిగారు. టి సిరీస్ ఓనర్‌కు రానా చాలా క్లోజ్ కావడంతో....... అజ్ఞాతవాసి నిర్మాతలు అతడి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

కాపీ అని తేలితే భారీ పరిహారం
ఒక వేళ ‘అజ్ఞాతవాసి' సినిమా.... టి-సిరీస్ దక్కించుకున్న ఫ్రెంచి సినిమాకు కాపీ అని తేలితే సినిమా భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఏదైనా తేడా వస్తే విషయం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది.

గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం
అయితే ఈ కాపీ వివాదాన్ని ఇరు వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా.... మీడియాకు లీక్ కాకుండా నడిపిస్తున్నారట. విషయం మీడియా వరకు వస్తే రచ్చ అయ్యే అవకాశం ఉండటం వల్లే అంతా సిక్రెట్ గా నడిపిస్తున్నారని టాక్. మరి ఇందులో నిజం ఎంత? అనే విషయంలో ‘అజ్ఞాతవాసి' నిర్మాతల నుండి ఓ క్లారిటీ వస్తే బావుంటుంది.

అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మాత.


Click it and Unblock the Notifications











