అజ్ఞాతవాసిలో ఆ రెండు రచ్చ రంబోలా.. సెకండాఫ్‌లో కేక పుట్టిస్తాయట..

By Rajababu

Recommended Video

అజ్ఞాతవాసిలో ఆ రెండు కేక పుట్టిస్తాయట..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు మీడియాలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. తాజాగా వెంకటేష్ అతిథి పాత్ర పోషిస్తున్నాడనే వార్త, పవన్ పాడిన పాట అభిమానుల్లో ఆసక్తిని పెంపొందించింది.

వెంకటేష్ ఎంట్రీ

వెంకటేష్ ఎంట్రీ

అజ్ఞాతవాసి చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో చాలానే హైలెట్స్ ఉన్నాయనేది తాజా సమాచారం. అందులో పవన్ పాడిన కొడుకో.. కోటేశ్వరరావు పాట, వెంకటేష్ గెస్ట్ ఎంట్రీ రెండూ కూడా వాటిలో ప్రముఖంగా పేర్కొంటున్నారు.

ఆ రెండూ సెకండాఫ్‌లోనే

ఆ రెండూ సెకండాఫ్‌లోనే

పవన్ చిత్రంలోని మిగితా అంశాలతోపాటు కొడుకో.. వెంకీ ఎంట్రీ రెండు కూడా ప్రత్యేకంగా సినిమా రెండో భాగంలో ఉన్నాయట. ఈ రెండు కూడా తెరపై రచ్చ రచ్చ చేస్తాయట. అంతేకాకుండా ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతాయనేది సినీ వర్గాల టాక్.

ఫ్యాన్స్‌కు కిక్కెక్కించేలా

ఫ్యాన్స్‌కు కిక్కెక్కించేలా

సాధారణంగా సినిమాను బ్యాలెన్స్ చేయడానికి ఫస్టాఫ్‌లో కొన్ని అంశాలు.. సెకండాఫ్‌లో మరికొన్ని అంశాలను చేర్చుతారు. దాంతో ప్రేక్షకులు నిరాశ చెందకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ చర్యలు తీసుకొంటున్నట. అంతేకాకుండా చాలా అంశాలు ఫ్యాన్స్‌ను కిక్కెక్కించేలా ఉంటాయట.

అందుకే సెకండాఫ్‌లో

అందుకే సెకండాఫ్‌లో

అజ్ఞాతవాసి చిత్రంలో కీలకమైన ఈ రెండు అంశాలు కూడా కథలో భాగంగా కావడం వల్ల సెకండాఫ్‌లో పెట్టకతప్పలేదట. దాంతో సెకండాఫ్‌లో ఇవి డబుల్ ధమాకా అని చిత్ర యూనిట్ పేర్కొన్నట్టు తెలిసింది.

31న పవన్ పాట రిలీజ్

31న పవన్ పాట రిలీజ్

ఇక అజ్ఞాతవాసి చిత్రం కోసం పాడిన పాటను డిసెంబర్ 31న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రీలీజ్ చేయనున్నారు. గతవారం పవన్ కల్యాణ్ తన గళాన్ని మరోసారి సవరించుకొని కొడుకో కోటేశ్వరరావు పాటను పాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదలై సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

జనవరి 10న రిలీజ్

జనవరి 10న రిలీజ్

హసిని, హారిక బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ రూపొందిన అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో పవన్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేష్, ఖుష్బూ, రావు రమేష్, బోమన్ ఇరానీ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X