ఎన్టీఆర్‌కు అజ్ఞాతవాసి షాక్.. త్రివిక్రమ్ కథపై యంగ్ టైగర్ పునరాలోచన
సినిమా ఇండస్ట్రీలో విజయాలు మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సక్సెస్‌లో ఏ మాత్రం తేడా ఉన్నా.. లేదా సందేహాలు ఏర్పడినా ముందే జాగ్రత్త పడుతారు. త్రివిక్రమ్ సినిమా పరిశ్రమకు భారీ సక్సెస్ ఇచ్చినా అజ్ఞాతవాసి చిత్రం అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ కలవరానికి గురిచేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. తన తదుపరి సినిమాకు కాపీరైట్ సమస్య రాకుండా ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.
Recommended Video


ఎన్టీఆర్ ముందే జాగ్రత్త
అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ చేయబోయే చిత్రం గురించి యంగ్ టైగర్ ముందే జాగ్రత్త పడుతున్నట్టు ఓ రూమర్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఎందుకంటే వరుసగా రెండోసారి త్రివిక్రమ్ కాపీరైట్ సమస్యను ఎదుర్కొన్నారు.

అ ఆ సినిమా విషయంలో
మీనా చిత్రం, యుద్ధనపూడి సులోచన చిత్రాన్ని అనుమతి లేకుండా కాపీ చేశారనే అంశం గతంలో అ ఆ చిత్ర విషయంలో బయటపడింది. అప్పట్లో ఆయా వ్యక్తులుకు ఏదో సర్దుబాటు చేశారు అనే విషయం మీడియాలో నానింది.

అజ్ఞాతవాసి కాపీరైట్ సమస్య
ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం కూడా త్రివిక్రమ్‌కు రెండోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు రావడం జరిగింది. ఫ్రెంచ్ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ, ఆడియో సంస్థ టీ సిరీస్‌తో రాజీ చేసుకొన్న పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించినట్టు వార్తలు వచ్చాయి.

త్రివిక్రమ్ ఫ్యాన్స్ రుసరుస
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్‌తో తీసే సినిమా ఎలా తీస్తాడో అనే భయాందోళలను యంగటైగర్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అజ్ఞాతవాసి చిత్రాన్ని విచ్చలవిడిగా తీశారనే విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.

పవన్ చేతుల మీదుగా
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభ సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఇంకా పూర్తి కాలేదని వార్తలు వస్తున్నాయి.

వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ అజ్ఞాతవాసి చిత్రం వస్తున్న
ప్రతికూల టాక్ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఫ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

కాపీరైట్ సమస్య రాకుండా..
కథా, స్క్రీన్ ప్లే తదితర విషయాలను దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా, కాపీరైట్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ను కోరుతున్నట్టు ఓ వార్త సినీ వర్గాల్లో నానుతున్నది. దాంతో ఎన్టీఆర్ జాగ్రత్తలు వ్యవహరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











