టెన్షన్!.. 'కేవియెట్' తెచ్చుకున్న అజ్ఞాతవాసి టీమ్..,లాస్ట్ మినిట్‌లో ఏం జరుగుతుందో?
Recommended Video

కథ.. కాస్టింగ్ దగ్గరి నుంచి సినిమా పట్టాలెక్కి.. అది విడుదలయ్యే దాకా నిర్మాతకు సవాలక్ష టెన్షన్లు. అంతా సవ్యంగా పూర్తయి ఇక విడుదలే ఆలస్యం అనుకున్న తరుణంలోనూ.. లాస్ట్ మినిట్‌లో 'కాపీ' వివాదాలు తెర పైకి రావడం నిర్మాతకు గుండె దడను పెంచేవే. అజ్ఞాతవాసి సినిమా విషయంలోనూ ఇప్పుడిదే జరుగుతోంది.

ఎందుకైనా మంచిదని..:
అసలే కాపీ వివాదాలు ముసురుకోవడం.. 'లార్గో వించ్' దర్శకుడు జెరోం సల్లే కూడా సినిమా చూస్తానంటూ ట్వీట్ చేయడంతో.. ఎందుకైనా మంచిదని అజ్ఞాతవాసి నిర్మాతలు 'కేవియట్' తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏంటీ కేవియెట్?:
లాస్ట్ మినిట్‌లో సినిమాపై టీ-సిరీస్ ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కుతుందోనన్న భయంతో.. ముందస్తుగా 'కేవియట్' తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. కేవియట్ ద్వారా సినిమా ప్రదర్శనకు ఆటంకం ఏర్పడకుండా ఉంటుందని ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

ఏ కోర్టులో?:
హారిక హాసిని యూనిట్ కేవియెట్ తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇందుకోసం ఏ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే దాదాపు 14కోర్టుల్లో కేవియట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అభిమానుల్లో టెన్షన్..:
కొత్తగా పుట్టుకొస్తున్న ఊహాగానాలు అటు అభిమానుల్లోనూ ఆందోళన పెంచుతున్నాయి. ఎక్కడ జనవరి 10న సినిమా విడుదల కాకుండా ఆటంకాలు ఏర్పడుతాయేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. ట్రైలర్ విడుదల జాప్యం కూడా వారిని ఒకింత అసంతృప్తికి గురిచేస్తోంది.

'నో వర్రీస్'..:
ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా.. ఒకసారి సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుందంటే.. ఆ వివాదాలన్ని గాలి కొట్టుకుపోవడం ఖాయమనేవారూ లేకపోలేదు. కాబట్టి 'కాపీ' వివాదంపై 'నో వర్రీస్' అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి విడుదలవేళ 'అజ్ఞాతవాసి'కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో!


Click it and Unblock the Notifications











