ముఖ్య‌మంత్రితో మెగా మేనల్లుడి ఢీ.. తప్పులను ఎత్తి చూపుతూ!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఏకంగా ముఖ్య‌మంత్రితో తలపడుతున్నారట. ఈ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ ముఖ్యమంత్రి ఎవరు? సాయి ధరమ్ తేజ్ ఆ ముఖ్య‌మంత్రితో ఢీ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మ్యాటర్ లోకి పోదామా..

అందరిలో అదే సందేహం

అందరిలో అదే సందేహం

అయినా ముఖ్య‌మంత్రితో హీరో సాయి ధరమ్ తేజ్ యుద్ధం చేయ‌డ‌మేంటి? అనే సందేహం అందరిలో కలగటం సహజమే. కాకపోతే ఇక్కడ ఆ ముఖ్యమంత్రి రియల్ కాదు రీల్ ముఖ్యమంత్రి. అదే.. ఆయన లేటెస్ట్ మూవీలో ముఖ్యమంత్రి రోల్ చేస్తున్న రమ్యకృష్ణతో ఢీ అంటే ఢీ అనేలా తలపడనున్నారట సాయి ధరమ్ తేజ్.

పవర్‌ఫుల్ పొలిటీషియన్‌.. సాయి ధరమ్ తేజ్ ఫైట్

పవర్‌ఫుల్ పొలిటీషియన్‌.. సాయి ధరమ్ తేజ్ ఫైట్

సాయి ధరమ్ తేజ్ హీరోగా దవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రోల్ కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా ఉండే ముఖ్యమంత్రి రోల్ పోషిస్తోందట. ఇందులో సాయి ధరమ్ తేజ్- రమ్యకృష్ణ మధ్య సాగే సన్నివేశాలు థియేటర్లను హోరెత్తించనున్నాయని అంటున్నారు.

స్టూడెంట్ లీడ‌ర్ సాయి ధరమ్ తేజ్..

స్టూడెంట్ లీడ‌ర్ సాయి ధరమ్ తేజ్..

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడని తెలిసింది. విద్యావ్య‌వ‌స్థ‌లోని తప్పులను ఎత్తి చూపుతూ ముఖ్య‌మంత్రిని ఢీ కొట్టే పాత్ర‌లో సాయితేజ్ ఓ రేంజ్ లో అలరించనున్నాడని సమాచారం. తాజాగా బయటకొచ్చిన ఈ వార్త మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

 సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌లో..

సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌లో..

సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌లో 14వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
సాయి ధరమ్ తేజ్.. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌

సాయి ధరమ్ తేజ్.. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌

ఇకపోతే ప్ర‌స్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మరో సినిమా ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌'. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ యెన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X