సినీ హిస్టరీలోనే Bunny-Trivikram సినిమా కోసం ఆ ప్రయోగం.. ఇక వారు తట్టబుట్ట సర్దుకోవాల్సిందేనా?
అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూటింగ్ లో బిజిబిజిగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఇండియన్ సినీ హిస్టరీలోనే బన్నీ, త్రివిక్రమ్ ఓ ప్రయోగం చేయబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
బన్నీ త్రివిక్రమ్ మూవీ అప్టేట్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, బన్నీ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజిగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుంచి రోజుకో వార్త బయటకు వస్తోంది.

ఓ సరికొత్త హీరోయిన్: తాజాగా బన్నీ, త్రివిక్రమ్ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇండియన్ సీని హిస్టరీలోనే ఎవరూ చేయలేని ప్రయోగం ఈ సినిమా కోసం చేయనున్నారట మేకర్స్. ఇక ఈ సినిమా కోసం మేకర్స్.. ఓ సరికొత్త హీరోయిన్ ను లాంఛ్ చేయనున్నారు. అయితే ఆ హీరోయిన్ మనిషి కాదు. అదేంటి అనుకుంటున్నారా... అవునండి మీరు విన్నది నిజమే.

మనిషి కాదు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఓ హీరోయిన్ ను ఈ సినిమా నుంచి పరిచయం చేస్తారట. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో రంగాలు అభివృద్ధి పథంతో ముందుకు వెళ్తున్నాయి. ఇటీవల ఏఐ యాంకర్లతో టీవీ ఛానళ్లు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరూ చేయని ప్రయోగం ఈ సినిమా ద్వారా చేసి.. మేకర్స్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు.
ఏఐ టెక్నాలజీతో: ఇక అల్లు అర్జున్ హీరోగా ఏఐ టెక్నాలజీతో ఓ అందమైన హీరోయిన్ త్వరలో వెండితెరపైకి తళుక్కుమననుందని తెలుస్తోంది. ఇక బన్నీ పక్కన ఎంతో మంది భామలు నటించారు. ఇక బన్నీకి సరిపోయే.. మైమరిపించే అందంతో ప్రేక్షకులు కట్టిపడేసేలా ఉండే.. ఓ ఏఐ హీరోయిన్ ను తీసుకురాబోతున్నారు. కృత్రిమ మేథతో పనిచేసే భామ అల్లు అర్జున్ పక్కన నటించనుందని సమచాారం.

వారికి చెక్: ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో కృత్రిమ మేథతో పనిచేసే బొమ్మ భామను హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నట్టు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అంతే కాదు.. ఈ ప్రయోగం చేసిన మొదటి రికార్డు మన వాళ్లకే దక్కుతుంది. అయితే రానున్న కాలంలో హీరోయిన్లకు గడ్డుకాలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇలా అందరూ ఏఐ హీరోయిన్స్ ను తీసుకుంటే.. ఇక హీరోయిన్లకు ఛాన్స్ లు తగ్గిపోతాయి. మరి రానున్న ఫ్యూచర్ ఎలా ఉండనుందో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











