హాలీవుడ్ మూవీతో ఐష్ రీఎంట్రీ?
తల్లయిన తర్వాత సినిమాలకు దూరం అయిన అందాల తార ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం అమ్మతనాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. మరి కొన్ని నెలల్లో తన కూతురు ఆరాధ్య సంవత్సరం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి తన ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటోంది. ఆమె నటించబోతోందంటూ కొన్ని బాలీవుడ్ పేర్లు వినిపించినప్పటికీ ఆమె ఇప్పటి వరకు దేనికీ సైన్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఓ హాలీవుడ్ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ టైటానిక్ చిత్రంలో హాట్ లేడీ కేట్ విన్ స్లెట్ సరసన నటించిన స్టార్ బిల్లీ జేన్‌తో ఐశ్వర్యరాయ్ నటించబోతోందట. ఇప్పటికే హాలీవుడ్ దర్శకుడు డేనియల్ సిల్వర్ ఆమెను సంప్రదించాడని...ఇందులో నటించడానికి ఐశ్వర్యరాయ్ ఓకే చెప్పిందని, ఇందులో బిల్లీ జేన్‌తో పాటు టీవీ నటి సారా ఖాన్, సింగర్ లక్కీ అలి కూడా నటిస్తున్నారని తెలుస్తోంది.
టీవీ నటి సారాఖాన్ మాట్లాడుతూ...నేను ఆ చిత్రానికి సైన్ చేశాను. వారు ఐశ్వరరాయ్‌ని కూడా సంప్రదించారు. సినిమా షూటింగు లాస్ ఏంజిల్స్‌లో సెప్టెంబర్ 13న ప్రారంభం అవుతుంది, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో నేను బిల్లీ వైఫ్ పాత్రలో నటిస్తున్నట్ల వెల్లడించింది.
ప్రెగ్నెన్సీ తర్వాత చాలా లావెక్కిన ఐశ్వర్య ప్రస్తుతం మెల్లమెల్లిగా బరువు తగ్గించుకుంటోంది. ఇటీవల కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య ప్రసవించిన తర్వాత కంటే చాలా అందంగా కనిపించింది. దీన్ని బట్టి ఆమె సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











