మణిరత్నం సినిమాతో ఐశ్వర్య రాయ్ రీఎంట్రీ
ఎట్టకేలకు ఐష్ రీ ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు మణి రత్నం రూపొందించబోయే చిత్రం ద్వారా ఐష్ రీ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 1938 విడుదలైన 'రెబక్కా' అనే నావల ఆధారంగా ఈచిత్రం ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం మణిరత్నం ఈచిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు వర్క్‌లో మునిగి పోయాడని, రెబెక్కా అనే నవల 'కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్త మొదటి భార్య గురించి తెలుసుకుంటూ ఆమెలా ఉండటానికి ఎలా తపన పడింది' అనే ఇతి వృత్తంతో సాగుతుందని, ఈ నవల ఆధారంగానే సినిమా ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఐశ్వర్య రాయ్ మణిరత్నం దర్శకత్వంలో ఇద్దరు, గురు, రావణ్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
ఐశ్వర్య తొలుత శ్రీరామ్ రాఘవన్'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతోందిన ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడేమో మణిరత్నం సినిమా ద్వారా అంటున్నారు.
ఈవార్తల్లో నిజం ఎంత? అనే సంగతి పక్కన పెడితే..... అందాల ఐశ్వర్య రాయ్ రీఎంట్రీపై అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆ అందాన్ని తెరపై కన్నులారా చూడాలని ఆశ పడుతున్నారు. ఐశ్వర్య కూడా అభిమానుల ఆకాంక్షకు తగిన విధంగా కథలను ఎంపిక చేసుకునే పనిలో ఉందట.


Click it and Unblock the Notifications












