మూడు దశాబ్దాల వయసు దాటినా ఐశ్వర్యా రాయ్ ఇప్పటికీ మోస్ట్ సెక్సి యెస్ట్ ఫిగర్. ఆమె ఎప్పుడు తల్లి అవుతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మూడు పదులు దాటింతరువాత మహిళల్లో పిల్లల్లి కనే అవకాశాలు సన్నగిల్లుతాయని వైద్యశాస్త్రం గొంతెత్తి మొత్తుకుంటున్నా, ఐశ్వర్యరాయ్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. వయసు మూడున్నర పదులు దాటుతున్నా..రోజురోజుకు తన రూప లావణ్యాలకు పెరుగుతున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ భామ రోజురోజుకూ బిజీగా మారిపోతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఈమెకు 'సూపర్ బిజీ స్టార్' అన్న టాగ్ లైన్‌ను బాలీవుడ్ మీడియా తగిలించేసింది. మొగుడితో ముద్దూమురిపాలు, పిల్లాపాపలతో ముద్దూముచ్చట్లు లేకుండా డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోయి ఐశ్వర్య బావుకునేది ఏమిటి?