Aishwarya Rai ఐశ్వర్య రాయ్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. పెళ్లైన 17 ఏళ్లకు భర్తతో విడాకులు!
ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. మేడ్ ఫర్ ఇచ్ అదర్ లాగా ఉండే కపుల్స్ కూడా విడిపోతున్నట్లు ప్రకటించి షాకిస్తున్నారు. మొన్నటివరకు సమంత, నాగచైతన్య.. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లాగా ఉండే వారు. ఏమైందో తెలియదు వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అటు కోలీవుడ్ లోనూ ధనుష్, ఐశ్వర్యలు కూడా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఐశ్వర్య రాయ్... కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ... బిజి బిజిగా మారిపోయింది. అయితే ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. త్వరలోనే వీరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

అభిషేక్, ఐశ్వర్య ఇద్దరు అందుకే విడివిడిగా ఉంటున్నారని రూమర్స్ వస్తున్న క్రమంలో స్కూల్ డే ఈవెంట్లో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య ఐశ్వర్యతో పాల్గొంది. బిగ్ బితో కలిసి ప్రొ కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో.... ఆ తర్వాత విడాకుల రూమర్ కు బ్రేక్ పడింది. కొన్నాళ్లుకు మళ్లీ విడాకుల వార్తలు వచ్చాయి.
ఓ ఈవెంట్లో అభిషేక్ బచ్చన్... పెళ్లి ఉంగరం ధరించకుండా రావడం వల్ల ఈ పుకార్లు వెల్లువెత్తాయి. దీంతో అందరూ వీరిద్దరు విడాపోతున్నారు కాబట్టే అలా చేశాడని అనుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వార్తలు వెల్లువెత్తున్నాయి. దానికి కారణం... అభిషేక్ బచ్చన్ తన ఇన్ స్టాగ్రామ్ లైఫ్ ఫెల్యూర్ పోస్ట్ పెట్టడమే అని తెలుస్తోంది. అభిషేక్ అలా పోస్ట్ పెట్టడంతో... విడాకులపై హింట్ ఇచ్చాడని అంతా అనుకుంటున్నారు.

అభిషేక్ బచ్చన్ పోస్టులో... పరాజయ భయం కలలను నాశనం చేస్తుంది. కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకుంటే కలలు నిజమవుతాయంటూ రాసుకువచ్చారు. దీంతో ఈ జంట విడాకుల వార్తలు మళ్లీ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పెళ్లైన 17ఏళ్లకు ఈ జంట విడిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ న్యూస్ తెలుసుకున్న ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.
ఇక ఐశ్వర్య రాయ్ విషయానికి వస్తే.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ ఫాంలోకి వచ్చిన ఐశ్వర్య.. చిరంజీవి విశ్వంభరలో నటించనుందని ప్రచారం జరుగుతుంది. ఇక సౌత్ సినిమాలతో పాటు.. పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ ఐశ్యర్య నటిస్తుంది. అభిషేక్ బచ్చన్ ఇటీవల ఘూమర్ చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.


Click it and Unblock the Notifications











