ఆ చిత్రంలో న్యూడ్ గా చేయటానికి ఐశ్వర్యా రాయ్..?

By Srikanya

ఐశ్వర్యా రాయ్ ని తాజాగా ఓ హాలీవుడ్ దర్శకుడు ఎప్రోచ్ అయ్యి హీరోయిన్ పాత్ర ఆఫర్ చేసారని బాలీవుడ్ లో టాక్ మొదలైంది. వారు చెప్పుకునే దాని ప్రకారం ఆ పాత్ర కోసం ఆమె న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించాలని చెప్పారుట. హాలీవుడ్ చిత్రాల్లో ఇది కామన్ అనీ, ఇంటర్నేషనల్ గా అవకాశాలు రావాలంటే,ఎదగాలంటే ఇలా ఎక్కడో చోట కమిట్ కాక తప్పదని ఆమె శ్రేయాభిలాషులు సలహా ఇస్తున్నారుట. ఇక ఐశ్వర్య మాత్రం తన భర్త అభిషేక్ ని అడిగి తన కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఏం చేసినా చేయగలనని నిక్కచ్చిగా చెప్పిందని అంటున్నారు. ఇక ఆ దర్శకుడు డానీ బోయల్ అతను స్లమ్ డాగ్ మిలియనీర్ తో ఆస్కార్ సాధించిన వాడని, అతను ఆఫర్ వదులుకోవద్దని ఆమెకు సలహా ఇస్తూ ఓ పత్రిక రాసుకొచ్చింది. ఇక ఇంతకు ముందు కూడా ఐశ్వర్య ది లాస్ట్ లీజియన్, పింక్ పాంధర్ అనే చిత్రంలో నటించిందని అప్పుడు అడ్డంకాని సమస్యలు,అపోహలు ఇప్పుడు అనవసరసం అని అంటున్నారు. అయితే తనకు వ్యక్తిగతంగా న్యూడ్ గా నటించటం ఇష్టమో కాదో అన్నది మాత్రం ఐశ్వర్య తేల్చి చెప్పటం లేదు. తన అభిమానులు కోసం అని తన కుటుంబం కోసమని,తన భర్త మనో భావలు కోసమని వాయిదా వేస్తోంది. ఇంతకీ ఏమి జరగనుందో మరికొద్ది రోజులు ఆగితే కానీ పూర్తి వివరాలు తెలియవు. ప్రస్తుతం ఆమె రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రోబో లోనూ,మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న రావణ్ లోనూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X