ఐశ్వర్య కూతురికి కూడా అదే దుస్థితా?

ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి ముందు ఓ సంఘటన జరిగింది. అదేమింటంటే ఐశ్వర్య రాహు-కేతు దోషంతో పుట్టినందు వల్ల ఆమెను తొలుత పెళ్లి చేసుకున్న వారికి చెడుజరుగుతుందని ఐశ్వర్యకు తొలి వివాహం రావిచెట్టుతో చేశారు. ఆ తర్వాత అభిషేక్ తో మూడు ముళ్లు వేయించారు. తాజాగా ఐశ్వర్య కూతురు అమ్మ పోలికలతో పుట్టడంతో పాటు అమ్మకు ఉన్న దోషాన్ని కూడా తాను వెంట తెచ్చుకుందని కొందరు జోతిష్య నిపుణులు చెప్పినట్లు తెలిసింది. జాతకాలు, వాస్తు, న్యూమరాలజీని బాగా నమ్మే బచ్చన్ కుటుంబం ఐశ్వర్య కూతురికి కూడా అదే విధంగా పెళ్లి చేయిస్తారేమో? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే హేతు వాదులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ఈ కాలంలో ఇలాంటి నమ్మడం ట్రాష్...లోకంలో దేవుడు లేడు, దెయ్యం అంతకన్నా లేదు, జాతకాలను నమ్మడం ఓ మూఢత్వం అని కొట్టి పారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











