ఫ్యాన్స్‌కు గుండెలు పగిలే న్యూస్... నాగ చైతన్య, సమంత బాటలోనే ఆ స్టార్ హీరో హీరోయిన్ విడాకులు
సెలబ్రెటిలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఎవరు ఎప్పుడు ప్రేమలో పడుతారో తెలియదు. నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ కు గురి చేశారు. ఇప్పుడు మరో సెలబ్రెటి జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాళ్లేవరో కాదు.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, అందాల భామ ఐశ్వర్య రాయ్. వీరు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. దానికి కారణం కూడా ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సెలబ్రిటీ జంటలు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం కొత్తేమి కాదు. మన దగ్గర టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ అంటే నాగాచైతన్య సమంత ఉండేవారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకుని... విడిపోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్ గుండెలు పగిలేలా చేశారు. ఇక ఈ జంట విడాకులు తీసుకుని ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఇక ఈ విడాకుల తర్వాత ఎంతో మంది సెలబ్రేటీలు కూడా విడిపోయారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో జంట కూడా విడాకులు తీసుకోబోతుందని తెలుస్తోంది.

అందాల భామ ఐశ్వర్యరాయ్ విడాకులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ల వివాహం గురించి గత కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్.. తన భాగస్వామి ఐశ్వర్యతో సఖ్యతగా లేరని... వారు విడిపోయి ఉంటున్నారని... విడాకుల కోసం దాఖలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ వైరల్ గా మారింది.
అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలకు ఓ విషయం మరింత బలం చేకూర్చింది. ఇటీవల అభిషేక్ బచ్చన్ తన మ్యారెజ్ ఉంగారన్ని ధరించకపోవడంతో.. ఈ వార్తలు నిజమని నమ్ముతున్నారు. వీరు విడిపోవడం అనుకోవడం వల్లే అభిషేక్ తన మ్యారేజ్ రింగ్ తీసేశారని అంటున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య, అభిషేక్ విడాకులు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఐశ్వర్య, అభిషేక్ జంటకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2007లో వీరు అతిరథ మహరథుల సమంక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక 2011లో వీరు ఆరాధ్య అనే అమ్మాయికి జన్మనిచ్చారు. 16 సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోవడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇన్ని ఏళ్లు వివాహ బంధంలో ఉండి ఇప్పుడు ఎందుకు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవల ఓ వేడుకకు హాజరైన అభిషేక్ బచ్చన్ తన వివాహ ఉంగరం లేకుండా కనిపించారు. దీని వల్లే మరోసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ విడిపోవాలని నిర్ణయించుకున్నారా అని కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు అతను తన వివాహ ఉంగరం ధరించడానికి నిరాకరించడం వెనుక వేరే కారణాలు ఉన్నాయా అని అనుమానిస్తున్నారు.
నిన్న జరిగిన అర్చివ్ ప్రిమియర్ వేడుకలో ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య పాల్గొన్నారు. ఈ వేడుకలో ఈ భామ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వేడుకలో కూడా ఐశ్వర్య.. తన భర్తను పట్టించుకోలేదని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిన ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలో ఎంత నిజం ఉందో కాలమే చెప్పాలి.


Click it and Unblock the Notifications











