Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బచ్చన్ ఫ్యామిలీలో విభేధాలు.. జాల్సాను వీడనున్న ఐశ్వర్య.. కొత్త ఇల్లు (ఫొటోలు)
Recommended Video
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో కలతలు చోటుచేసుకొన్నాయనే వార్త తరచుగా మీడియాలో వినిపిస్తున్నది. అత్త జయబచ్చన్, వదిన శ్వేతాబచ్చన్ నందాకు మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయనే వార్తలు ఇటీవల ముంబై మీడియాలో ఊపందుకొన్నాయి. అమితాబ్ బచ్చన్ నివాసం జాల్సాను ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు వీడనున్నారా? అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులు వేరు కాపురం పెట్టనున్నారనే వార్తలు ఊపందుకోన్నాయి. అందుకు కారణం ముంబైలో 21 కోట్లతో ఐశ్వర్యరాయ్ ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయడమే. అందుకు సంబంధించిన ఫొటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. అవి మీ కోసం...
బాంద్రాలో విలాసవంతమైన ఫ్లాట్
ముంబైకి చెందిన ప్రముఖ మ్యాగజైన్ కథనం ప్రకారం.. 2015 చివర్లో ఈ విలాసవంతమైన ఫ్లాట్‌ను అభిషేక్, ఐశ్వర్య దంపతులు కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం 5500 స్వ్కేర్ ఫీట్లు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని సిగ్నియా ఐసల్స్లోని విలాసవంతమైన ఫ్లాట్ ఖరీదు రూ.21 కోట్లు.
అత్యంత అద్భుతంగా ఫ్లాట్ డిజైన్
ఈ విలాసవంతమైన ఫ్లాట్‌లో చదరపు అడుగు ఖరీదు రూ.38 వేలు. సిగ్నియా ఐసల్ అపార్ట్‌మెంట్‌ను తలాతి పాంథకీ అసోసియేట్స్ డిజైన్ చేసింది. ఐశ్వర్య కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను సంటెక్ రియాలిటీ సంస్థ హంగులను తీర్చిదిద్దింది.
సోనమ్ కపూర్ కూడా
ఇదే అపార్ట్మెంట్లో చాలా మంది సినీ ప్రముఖులు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. బాలీవుడ్ అందాల నటి సోనమ్ కపూర్ 7 వేల చదరపు అడుగుల డుప్లెక్స్ ఫ్లాట్‌ను కోనుగోలు చేసింది. దాని ఖరీదు రూ.35 కోట్లు.
బచ్చన్ ఫ్యామిలీకి
బచ్చన్ ఫ్యామిలీకి జాల్సా నివాసం కాకుండా దుబాయ్‌లోని జమీరా గోల్ప్ ఎస్టేట్స్‌లో సాంక్చురీ ఫాల్స్ ప్యాలెటియల్ విల్లా ఉంది. అంతేకాకుండా ముంబై వర్లీలోని స్కైలార్క్ టవర్స్‌లోని 37వ ఫ్లోర్లో మరో ఫ్లాట్ కూడా ఉంది.
కంగన రనౌత్ కూడా కొత్త ఇంట్లోకి
ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటి కంగన రనౌత్ కొనుగోలు చేసిన కొత్త విల్లా ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. అందమైన ప్రదేశంలో చుట్టు పచ్చటి వాతావారణం మధ్య ఉన్న భవనం అందర్ని ఆకట్టుకొంటున్నది.
కంగన ఇంటి డెకరేషన్
కంగన రనౌత్ ఇంటి డెకరేషన్ అద్భుతంగా ఆకట్టుకొంటున్నది. కొత్త సంవత్సరం సందర్భంగా కంగనా రనౌత్ కొత్త ఇంట్లో చేరడంపై ఆ ప్రాంతవాసులు ఆనందంతో స్వాగతం పలికారు.
మణికర్ణిక షూటింగ్లో కంగన
కొత్త ఇంట్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత కంగన ప్రస్తుతం రాజస్థాన్‌కు వెళ్లింది. మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ జాన్స్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.