twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ ఐశ్వర్యరాయ్ మళ్లీ నెల తప్పిందా?

    By Bojja Kumar
    |

    ముంబై: హీరోయిన్ ఐశ్వర్యరాయ్ మళ్లీ నెలతప్పిందా? త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందా? అంటే అవుననే వార్తలు ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఐశ్వర్యరాయ్‌ని చూసిన చాలా మంది ఈ వార్త నిజమే అని నమ్ముతున్నారు.

    ఐశ్వర్యరాయ్ బాడీలాంగ్వేజ్‌లో తేడా కనిపించడం, ఆమె కడుపు భాగం ఉబ్బెత్తుగా ఉండటమే ఇందుకు బలమైన సాక్ష్యాలు అని చెబుతున్నారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్ 40 సంవత్సరాల వయసు దాటింది. మరింత లేటయితే పిల్లలు పుట్టడంలో సమస్యలు ఏర్పడే నేపథ్యంలో వీలైనంత త్వరగా ఐశ్వర్య-అభిషేక్ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    Aishwarya Rai Bachchan pregnant again?

    ఇటీవల ముంబైలో జరిగిన లోక్ సభ ఎన్నికల ఓటింగులో పాల్గొనడానికి వచ్చిన ఐశ్వర్యరాయ్‌ని చూసిన చాలా మంది ఆమెలో మళ్లీ గర్భవతయిన చాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో నిలకడ మీద తేలే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

    అయితే బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు మాత్రం ఈ వార్తలను అంత ఈజీగా నమ్మడం లేదు. తమ కుటుంబానికి సంబంధించిన ఏ విషయం అయినా అమితాబ్ జీ తన బ్లాగు ద్వారా బయట పెడతారు. ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన విషయాలు తప్పకుండా చెబుతారు. ఆయన నుండి ఎలాంటి స్పందన లేదంటే...ఈ వార్తలు అంత నమ్మదగినవి కాదని అంటున్నారు.

    ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ వివాహం జరిగి 7 సంవత్సరాలు పూర్తయింది. వీరికి ఇప్పటికే ఆరాధ్య బచ్చన్ జన్మించిన సంగతి తెలిసిందే. మొదటి సారి కూతురు పుట్టిన నేపథ్యంలో మరో దఫా కుమారుడికి జన్మనిస్తే బాగుంటుందని బచ్చన్ కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు.

    English summary
    Abhishek Bachchan and his beautiful bride Aishwarya Rai Bachchan recently completed seven years of matrimony. The couple is blessed with a baby girl Aaradhya but if we give any importance to the rumour mills, it is allegedly being said that Aishwarya Rai Bachchan is pregnant yet again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X