»   » భర్త కంటే డబ్బే ముఖ్యమా? 10 కోట్ల వ్యవహారంలో ఐశ్వర్యరాయ్

భర్త కంటే డబ్బే ముఖ్యమా? 10 కోట్ల వ్యవహారంలో ఐశ్వర్యరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai Rejects Abhishek Bachchan

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ఇద్దరూ సినిమాల్లో కొనసాగుతూనే అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే విధంగా బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్‌కు భర్తకంటే డబ్బే ఎక్కువైందని, ఆమె తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరూ కలిసి అప్పట్లో మణిరత్నం ‘రావన్' చిత్రంలో నటించారు. మళ్లీ ఈ జంట ఎప్పుడు కలిసి నటిస్తారో? అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో శైలేష్ ఆర్ సింగ్ అనే దర్శకుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఐష్ మూలంగా ఈ ప్రయత్నం బెసిడికొట్టిందని, అందుకే ఈ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని టాక్.

 స్క్రిప్టు మార్చమని చెప్పిన ఐష్

స్క్రిప్టు మార్చమని చెప్పిన ఐష్

ఫిల్మ్ మేకర్ శైలేష్ ఆర్ సింగ్ ఇటీవలే ఇద్దరినీ కలిసి స్క్రిప్టు వివరించారని.... స్క్రిప్టు విన్న వెంటనే అభిషేక్ బచ్చన్ సుముఖత వ్యక్తం చేసినా..... ఐశ్వర్యరాయ్ మాత్రం స్క్రిప్టులో మార్పులు చేయాలని కోరిందని టాక్.

 ఇది ఎలాంటి కథ?

ఇది ఎలాంటి కథ?

సదరు దర్శకుడు తను తీయబోయే సినిమాలో ఐష్-అభి ఇద్దరినీ టాప్ పోలీస్ ఆఫీసర్లుగా వారి పాత్రలు రాసుకున్నారని, ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారని, అయితే పొలిటికల్ క్రైసిస్ వల్ల ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుందని.... అయితే ఈ కథ నచ్చినప్పటికీ ఐశ్వర్యరాయ్ కొన్ని మార్పులు కోరిందని తెలుస్తోంది.

రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్

రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్

ఐష్ కోరిక మేరకు సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి ఐశ్వర్య రాయ్‌ను సంప్రదించగా అప్పటికే ఐశ్వర్యరాయ్ మరో చిత్రానికి సైన్ చేసిందని, సదరు చిత్రం వారు దాని కంటే ఎక్కువగా రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో దానికే కమిటైందని టాక్.

భర్త కంటే డబ్బే ముఖ్యమా?

భర్త కంటే డబ్బే ముఖ్యమా?

అయితే భర్తతో కలిసి నటించే అవకాశం ఉన్న సినిమాను వద్దనుకుని.... ఇలా కేవలం రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చే సినిమాకు ఐశ్వర్యరాయ్ కమిట్ కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమెకు భర్త కంటే డబ్బే ముఖ్యమైందా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

English summary
As per the rumours suggest, Aishwarya has lost a film with Abhishek Bachchan owing to her pricey attitude and strange behaviour. Because of the same reason, Abhishek has also backed out from the film, leaving the producer quite disappointed!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu