twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    44ఏళ్ల వయసులోనూ..: బాలీవుడ్‌లో అంతా 'ఐష్' గురించే చర్చ, విషయమేంటి?

    |

    Recommended Video

    బాలీవుడ్‌లో అంతా 'ఐష్' గురించే చర్చ,..విషయమేంటో తెలుసా ?

    ఐష్.. ఈ పేరు వింటే చాలు ఆమె అభిమానుల హార్ట్ బీట్ మారుతుంది. ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ఈ బ్యూటీ ఇప్పటికీ కోట్ల మంది గుండెల్లో తిష్ట వేసుకునే ఉంది. సహజంగా గ్లామర్ వరల్డ్‌లో ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్ల కెరీర్ నేలచూపులు చూస్తుంది. కానీ ఐష్‌కు మాత్రం బాలీవుడ్‌లో ఇంకా డిమాండ్ తగ్గకపోవడం విశేషం.

     ఐష్.. దాన్ని బద్దలు కొడుతోంది:

    ఐష్.. దాన్ని బద్దలు కొడుతోంది:

    సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ల విషయంలో హీరోయిన్లపై వివక్ష కొనసాగుతుందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాస్తవం కూడా అదే అన్నది జగమెరిగిన సత్యమే. హీరోలతో పోల్చితే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. కానీ ఐష్ మాత్రం దీన్ని బద్దలుకొడుతోందనే చెప్పాలి.

     భారీ రెమ్యునరేషన్:

    భారీ రెమ్యునరేషన్:

    1967నాటి 'రాత్ ఔర్ దిన్' రీమేక్‌లో నటించడానికి ఐష్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలనాటి నర్గీస్ దత్ చేసిన పాత్రను ఇప్పుడు ఐష్ తో చేయించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్ర కోసం ఐష్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.10కోట్లు ఆమెకు ముట్టజెప్పడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట.

     44ఏళ్ల వయసులోనూ..:

    44ఏళ్ల వయసులోనూ..:

    స్టార్ హీరోలతో పోల్చితే ఇది తక్కువే అయినప్పటికీ.. 44ఏళ్ల వయసులోనూ ఓ హీరోయిన్‌కు ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇదే ప్రథమమా? అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఈ దెబ్బతో ఐష్ తనకే మాత్రం డిమాండ్ తగ్గలేదని నిరూపిస్తోంది.

     ఈ వయసులో 'లీడ్ రోల్స్':

    ఈ వయసులో 'లీడ్ రోల్స్':

    సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లను హీరోల పక్కన చూపించడానికి దర్శకులు, నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఐష్ మాత్రం ఇందుకు అతీతంగా ఉన్నారనే చెప్పాలి. ఐష్ తప్ప వేరొకరితో రాత్ ఔర్ దిన్ చేయడం అంతగా వర్కౌట్ కాదన్న ఉద్దేశంతోనే నిర్మాతలు ఆమెకు అంత భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

     ఎక్కువ కాల్షీట్స్:

    ఎక్కువ కాల్షీట్స్:

    రాత్ ఔర్ దిన్ సినిమా కోసం నిర్మాతలు ఐష్ నుంచి ఎక్కువ కాల్షీట్స్ అడిగినట్లు తెలుస్తోంది. పైగా.. ఈ సినిమా సమయంలో మరే సినిమా షూటింగ్ లోనూ పాల్గొనే అవకాశం ఉండదట. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ కూడా భారీగానే ముట్టజెప్పుతున్నారన్న వాదన వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ఐష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట.

    వేరియేషన్స్..:

    వేరియేషన్స్..:

    2016లో యే దిల్ హై ముష్కిల్ తర్వాత సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న ఐష్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. రాత్ ఔర్ దిన్ తో పాటు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

    English summary
    Aishwarya Rai apparently asked for a hefty sum of Rs. 10 crores, sources told mid-day. "Aishwarya has demanded Rs. 10 crore for her next film, Raat Aur Din (1967) remake," stated the mid-day report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X