ఐశ్వర్య రాయ్ టీవీ రియాల్టీ షో?
అందాల తార ఐశ్వర్య రాయ్ త్వరలో బుల్లి తెరపై దర్శనం ఇవ్వబోతోందా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ వర్గాల నుంచి. త్వరలో ఓ రియాల్టీ షో ద్వారా నేషనల్ ఛానల్ లో ఆమె ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మామ అమితాబ్, తన మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్, తన కోస్టార్స్ షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లు బుల్లి తెరపై హల్ చేస్తూ ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో తాను ఆ బాటలో నడిచి మరింత కీర్తి, డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉందట ఐష్.
ఇటీవలే డెలివరీ అయిన ఐశ్వర్య తన పాప ఆలన పాలన చూసుకోవడంలో తలమునకలై పోయింది. సినిమాలు చేయాలని ఉన్నా అవి ఒప్పుకుంటే ఇంటి పట్టున ఉండటం కష్టం అవుతుంది కాబట్టి కొంత కాలం వరకు సినిమాలను వాయిదా వసుకుని టెలివిజన్ రియాల్టీ షోల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తూంది. ఇటీవల ఐశ్వర్యను కలిసిన సంజయ్ లీలా బన్సాలీ తనతో ఈ సినిమా చేసే విషయంతో పాటు ఓ రియాల్టీ షోకి జడ్డిగా వ్యవహరించాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తూంది. త్వరలోనే ఐశ్వర్య రాయ్ తన బెల్లితెర ఎంట్రీ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











