నటుల్ని లీనం చేయడంలో ఆయనే దిట్ట...
ఈనెల 18న విడుదలకు సిద్దమౌతోన్న 'విలన్" సినిమా గురించి కాసేపు అందాల భామ ఐశ్వర్య రాయ్ ముచ్చటించారు. ఇప్పటి వరకూ చేసిన సినిమాల కంటే 'విలన్" ఎక్కువ అనుభూతుల్ని మిగిల్చింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ లో సరదాగా ఉన్నట్లే అనిపించినా ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అంటుంది ఐష్.
ఈ సినిమాలో నా పాత్ర పేరు రాగిణి. నేను ఓ పోలీసు అధికారి భార్యను. అలాగే చిన్న పిల్లలకు శాస్త్రీయ నత్యం నేర్పిస్తుంటాను. చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర నాదని గర్వంగా చెప్పుకుంటోంది ఆమె.
అసలు 'కథ"లో నటుల్ని లీనం చేయడం ఎలాగో మణిరత్నాన్ని చూసే నేర్చుకోవాలి. నటులకు గొప్ప స్ఫూర్తి ఆయన అని పొగిడేసారు. ఆమె చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఈ చిత్రంలో ఎంత లీనమైన పాత్రలో నటించిందో మరి..సినిమా చూస్తేగాని తెలియదు.
ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విక్రమ్ పృద్వీరాజ్ మణిరత్నం aishwarya rai abhishek bachchan vikram prithviraj mani ratnam


Click it and Unblock the Notifications