Divorce ఐశ్వర్య రాయ్‌తో అభిషేక్ విడాకులు.. రూమర్లకు చెక్ పెట్టిన సాక్ష్యం ఇదే!

దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ కార్యక్రమాల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఒకటిగా నిలిచింది. ఈ పెళ్లి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా అందరి నోట ప్రముఖంగా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా సాగిన ఈ పెళ్లిలో మరోసారి ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకుల వివాహం చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిలో అభిషేక్ బచ్చన్ పెళ్లి వ్యవహారం చర్చకు రావడం వెనుక కారణం ఏమిటంటే?

గత కొద్దికాలంగా మీడియాలో అభిషేక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశమైంది. అయితే తాము డైవోర్స్ తీసుకొంటున్నామని వస్తున్న వార్తలపై వారిద్దరూ మౌనంగానే ఉన్నారు. అయినా వారిద్దరు సపరేట్ అవుతున్నారనే వార్తలకు మాత్రం ఏమాత్రం జోష్ తగ్గలేదు.

Aishwarya Rai divorce with Abhishek Bachchan Anant Amabani Wedding Clear all Rumours

అయితే అభిషేక్, ఐశ్వర్య దాంపత్య జీవితంలో విభేదాలకు ప్రధాన కారణం జయబచ్చన్, శ్వేత బచ్చన్ అనే వాదన మీడియాలో బలంగా వినిపించింది. కానీ శ్వేత బచ్చన్‌కు, ఐశ్వర్యకు మధ్య మనస్పర్ధలు రావడం, అలాగే జయబచ్చన్‌తో ఐష్ సంబంధాలు సరిగా లేవనే విషయాలు గాసిప్స్‌కు ప్రాణం పోశాయి.

ఇటీవల బిగ్ బీ మనవడు అగస్త్య నందా నటించిన తొలి వెబ్ సిరీస్ ధి ఆర్చీస్ ప్రీమియర్ షో సందర్భంగా బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిశారు. ఆ సమయంలో బచ్చన్ కుటుంబం అంతా కలిసినప్పటికీ.. శ్వేత, ఐశ్వర్య, జయబచ్చన్ ఒకరికొకరు మాట్లాడుకొన్నట్టు కనిపించలేదు. వారు పొడిపొడిగా, అంటి ముట్టనట్టు మాట్లాడుకోవడమే కనిపించింది. దాంతో విడాకులు దిశగా ఐశ్వర్య అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

Aishwarya Rai divorce with Abhishek Bachchan Anant Amabani Wedding Clear all Rumours

అయితే జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ వివాహం వేడుకలో బచ్చన్ ఫ్యామిలీ అంతా మెరిశారు. ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కలిసి కట్టుగా పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్వేత, ఐశ్వర్య ఒకరికొకరు మాట్లాడుకొంటూ సరదాగా కనిపించారు. వారిద్దరి వెనుకే అభిషేక్ బచ్చన్ వారి మాటలు వింటూ కనిపించారు. దాంతో అభి, ఐష్ దాంపత్యంలో, బచ్చన్ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. మీడియాలో విడాకులపై వస్తున్న వార్తలన్నీ రూమర్లే అంటూ నెటిజన్ల కొట్టిపడేస్తున్నారు.

ఇక ఐశ్వర్య రాయ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొత్తగా సినిమాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కొన్ని కథలు వింటున్నారు. కొన్ని ప్రాజెక్టుల ఒకే చేయాల్సి ఉన్నవని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X