Divorce: భర్త అభిషేక్ బచ్చన్‌కు దూరంగా.. మాజీ ప్రియుడు సల్మాన్‌కు చేరువగా ఐశ్వర్య రాయ్!

ఇప్పుడు ఇండియా అంతా ఎంతో ఆసక్తిగా మాట్లాడుకునున్న పెళ్లి అంబానీ ఇంట గ్రాండ్ గా జరుగుతున్నా సంగతి తెలిసిందే. కాగా ఈ భారీ పెళ్లి వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అంతా వచ్చి పాల్గొన్నారు. అంతే కాకుండా రాజకీయ నాయకులూ, టాలీవుడ్ స్టార్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు అలాగే హాలీవుడ్ స్టార్స్, కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.

మరి ఈ ఇండస్ట్రీస్ తో పాటుగా బాలీవుడ్ నటులు కూడా ఈ పెళ్లి వేడుకల్లో కనిపించారు. అయితే ఈ అందరిలో కూడా అంబానీ మావకి దగ్గరైన బాలీవుడ్ స్టార్స్ విషయంలో చాలా అట్రాక్షన్ గా నిలిచారు. మరి వారిలో బాలీవుడ్ స్టార్స్ కి అంబానీ కోట్లు ఖరీదు చేసే వాచ్ లను బహుమానంగా అందించారు. దీనితో అలా బాలీవుడ్ ప్రముఖులు కోసం వార్తలు వైరల్ గా మరి సోషల్ మీడియాలో కూడా హైలైట్ గా నిలిచారు.

aishwarya rai far from husband but takes pic with salman khan

కాగా ఈ పెళ్లి ఈవెంట్ లో అనేకమంది బాలీవుడ్ స్టార్స్ చాలా తమ కుటుంబాలతో హాజరు కాగా అందులో బాలీవుడ్ లెజెండ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కుటుంబం కూడా వచ్చారు. అయితే అందరి కుటుంబాల్లో కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా వీరి ఫ్యామిలీనే నిలిచారు. కాగా వారితో అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ కూడా వచ్చాడు కానీ అతని పక్కన అతని భార్య ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కనిపించకపోవడం వైరల్ గా మారింది.

పోనీ ఆమె రాలేదా అంటే వచ్చింది కానీ తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరేగా ఆ పెళ్లి వేడుకల్లో కనిపించింది. దీనితో బాలీవుడ్ నెటిజన్స్ లో ఆ పెళ్లి కంటే కూడా వీరి కోసమే ఎక్కువ హాట్ టాపిక్ నడిచింది. బచ్చన్ కుటుంబం నుంచి ఐష్ విడిపోయినట్టే అని మరిన్ని బలమైన రూమర్స్ మొదలయ్యాయి. అయితే వీటికి మించిన హైలైట్ ఇంకొకటి ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

aishwarya rai far from husband but takes pic with salman khan

తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఎక్కడా కలిసి కనిపించని ఐశ్వర్య రాయ్ తన కో స్టార్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మన్ ఖాన్ తో కలిసి కనిపించింది. పైగా తనతో కలిసి ఫోటో కూడా దిగింది. సల్మాన్, ఐష్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఉండేవి. ఐష్‌ను కొట్టినట్టు.. మానసికంగా టార్చర్ చేశారనే విషయం మీడియాలో ప్రచారమైంది. ఇప్పటి వరకు వారిద్దరూ పెద్దగా కలువనూ కూడా లేదు. కానీ దీనితో ఇప్పుడు భర్త అభిషేక్ కి దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సల్మాన్ తో దగ్గరగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్, ఐశ్వర్య ఫోటో వైరల్ కావడంతో.. ఫేకా? నిజమా? అనేది చర్చనీయాంశమైంది.

aishwarya rai far from husband but takes pic with salman khan

ఇలాంటి వార్తలు, చర్యలతో బచ్చన్ ఫ్యామిలీతో దూరాన్ని ఐశ్వర్య రాయ్ కావాలనే మైంటైన్ చేస్తుందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. దాదాపు వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అంబానీ ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్ ఒంటరిగానే వచ్చి ఫోటోలకు ఫోజిచ్చారు. తాజా కథనాల ప్రకారం.. ఐశ్వర్య తన కూతురుతో కలిసి ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీటితో నిజంగానే ఈ జంట కాంట్రవర్సీ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X