ఐశ్వర్య రాయ్ శృంగారభరిత సినిమా ఓన్లీ ఫర్ అడల్ట్స్ కేనట..!
వెండితెర అప్సరస ఐశ్వర్యారాయ్ నవరసాల్లో ఏ రసాన్నైనా అవలీలగా పోషిస్తుంది. ఇపుడామె చేతికి శృంగార రసాన్ని సంపూర్ణంగా పోషించాల్సిన క్యారెక్టర్ వచ్చింది. వివాదాస్పద దర్శకునిగా పేరున్న మధుర్ భండార్కర్ తాజాగా 'హీరోయిన్' అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ 'హీరోయిన్'లో ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ చేస్తోంది. మొదట కత్రినాకైఫ్ అనుకోగా ఈ పాత్రకు ఐశ్వర్య కరెక్ట్ గా సూట్ అవుతుందని ఐష్ ను ఈ చిత్రానిక సెలక్ట్ చేసినట్టు సమాచారం. కాకపోతే ఇవాల్టి తరం తారామణులు ఎలాంటి ఓవర్ ఎక్స్‌పోజింగ్‌లు చేస్తున్నారనే అంశాలతోపాటు పలు శృంగారభరితమైన సన్నివేశాలను ఇందులో దట్టించనున్నారట.
పెద్దలు మాత్రమే చూడాల్సిన సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయని భోగట్టా. స్క్రిప్టు ప్రకారం చూస్తే ఐష్ ఎద అందాలను ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయాల్సి ఉంటుందనీ, అదేవిధంగా బికినీ సైతం వేసుకోవాల్సి రావచ్చనీ చెపుతున్నారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత సిద్ధార్థరాయ్‌ని అడిగితే, మధుర్ స్క్రిప్టును పక్కాగా తయారు చేసుకున్నారు. స్క్రిప్టు ప్రకారం హీరోయిన్ ఎలా ఉంటే ఐష్ అలా నటిస్తుందని చెప్పారట. కనుక కొత్త హీరోయిన్ అవతారంలో ఐష్ ఘాటెక్కిస్తుందన్నమాట.


Click it and Unblock the Notifications











