రజనీతోనే... ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్?
ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ మరో సంవత్సరం తర్వాత మళ్లీ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. డెలివరీ తర్వాత తన సినీ కెరియర్ కి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉండటానికి తనకు వచ్చిన ఆఫర్లను వద్దనకుండా ఓకే చేసేస్తుంది. ఇటీవల ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ వచ్చి సినిమా గురించి చెప్పగానే వెంటనే సైన్ చేసి నటించడానికి ఓకే చెప్పింది కూడా. దీన్ని బట్టి ఈయనగారి దర్శకత్వంలో వచ్చే సినిమాతోనే ఐశ్వర్య సెకండ్ ఇన్సింగ్స్ ఉంటుందని అంతా భావించారు.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐశ్వర్య రాయ్ రజనీకాంత్ హీరోగా వస్తున్న దక్షిణాది సినిమా ద్వారా సెక్సండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన కూతురు ఐశ్వర్య దర్వకత్వంలో రజనీకాంత్ 'కొచ్చాదయన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ గెస్ట్ పాత్రలో దర్శనం ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కొచ్చాదయన్ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది కూడా. దాదాపు 2012 లోనే ఆ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి సంజయ్ లీలా బన్సాలీ చిత్రంకంటే ముందుగానే రజనీ సినిమా ద్వారా ఐశ్వర్యరాయ్ మళ్లీ వెండి తెరపై కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











