హీరోయిన్ కావాలంటే సెక్సువల్ ఫేవర్స్ తప్పవనే జగద్విదిత సత్యం..
వాస్తవిక కథాంశాలతో సినిమాలు తీసే డైరెక్టర్ మాధుర్ భండార్కర్ తన నెక్స్ ట్ టార్గెట్ గా తాను పని చేస్తున్న సినీ సీమనే పెట్టుకున్నాడు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లు పడే కష్టాలని అతను చూపించబోతున్నాడు. హీరోయిన్ కావాలంటే సెక్సువల్ ఫేవర్స్ తప్పవనే జగద్విదిత సత్యాన్ని మాధుర్ కళ్లకు కట్టబోతున్నాడు. మరీ బోల్ట్ కంటెంట్ అని తెలియడంతో 'హీరోయిన్" సినిమాలో నటించనని కరీనా కపూర్ తప్పుకుంది. సెక్స్ సీన్స్ మరీ టూమచ్ గా ప్లాన్ చేశాడని, వాటిలో నటిస్తే నటిగా తన ఇమేజ్ పడిపోతుందని కరీనా వివరించింది.
ఇప్పుడదే పాత్ర పోషించడానికి ఐశ్వర్య రాయ్ ముందుకొచ్చింది. హీరోయిన్ కథని యథాతథంగా చేసే నాయిక దొరికితేనే దానిని తీస్తానని, లేదంటే వదిలేస్తానని చెప్పిన మాధుర్ ఇప్పుడు ఐశ్వర్య కోసం కథ, సన్నివేశాలు మార్చి ఉంటాడని అనుకోలేం. ఒకవేళ అతను ముందు అనుకున్నట్టే సినిమా తీస్తుంటే కనుక కరీనా భయపడి పారిపోయిన శృంగార దృశ్యాల్లో ఐశ్వర్య రాయ్ నటించడానికి సిద్దపడ్డట్టేగా? ఈ అంశం ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం పొందడంతో హీరోయిన్ కి గిరాకీ బాగా పెరిగింది.


Click it and Unblock the Notifications











