ఆ హీరోతో లిప్ లాక్ ఇష్టంలేక బాలీవుడ్ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో హీరోయిన్ గా రాణించాలంటే.. అందించవచ్చిన అన్ని రకాల పాత్రలలో, సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. అలాగైతే.. ఇండస్ట్రీలో ఉండగలమని భావిస్తున్నారు. కానీ, కొంతమంది హీరోయిన్లు ఎలాంటి ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా.. తమకు నచ్చిన పాత్రలోనే నటిస్తూ.. తమకు వచ్చిన అవకాశాలలోనే తమ ప్రతిభను కనబరుస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. అలాగే ఓ బాలీవుడ్ బ్యూటీ లిప్స్ లాక్ ఇష్టం లేక రెండు భారీ హాలీవుడ్ సినిమాలనే వదులుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ బాలీవుడ్ ప్రాజెక్టులేంటీ?
ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai). ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె అందానికి ఐకాన్. ఎంతమంది అందగర్తలు నిలిచిన ఆమెకు సాటిరారు. అలాంటి అందం ఐశ్వర్య సొంతం. ఐదు పదుల వయసు దాటిన తగ్గని గ్లామర్ ఆమె అదృష్టం. ఈ అందాలరాణి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అందం అభినయంతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును సాధించుకుంది. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్ పిక్స్ ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఆధ్యనే అనే పాప కూడా ఉంది.

ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలలో కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 2000 సంవత్సరంలో ఐశ్వర్యరాయ్ కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ తరుణంలో బాలీవుడ్ సినిమాలు వరుస హిట్లు కావడంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో ఆమెకు హాలీవుడ్ లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఇలా బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రను పోషించి, తనకంటూ మెప్పించింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వచ్చాయట. కానీ రొమాంటిక్ సీన్లలో, లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఇష్టం లేక ఆఫర్లను రిజెక్ట్ చేసిందట.
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ బ్లాక్ బస్టర్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్'లో హీరోయిన్‌గా నటించే అవకాశం ముందుగా ఐశ్యర రాయ్ కే వచ్చిందట. కానీ, కొన్ని ఇంటిమేట్ సీన్స్‌తో పాటు లిప్ లాక్ సీన్స్ ల్లో కూడా నటించాలని మూవీ మేకర్స్ చెప్పారంట. దీంతో ఆ సినిమాను రికెస్ట్ చేసిందట. అలాగే.. హాంకాక్(Hancock) అనే సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌తో నటించే అవకాశం వచ్చిందట. అయితే అందులో విల్ స్మిత్‌తో లిప్‌లాక్ చేసే సీన్ చేయాలని చెప్పడంతో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట ఐశ్వర్య. ఇలా హలీవుడ్ అవకాశాలను వదులుకుంది ఐశ్వర్య. ఈ మూవీలో నటించి ఉంటే.. ఐశ్వర్య ఏ రేంజ్ లో ఉండేదో.. అని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. అభిషేక్ బచ్చన్‌తో విడాకుల పుకార్ల కారణంగా ఐశ్వర్య రాయ్ వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ II లో నటించింది. అందులో ఐశ్వర్య నటనకు యావాత్తు దేశం ఫిదా అయింది.


Click it and Unblock the Notifications











