హాట్ ఐటం సాంగులో ఐశ్వర్యరాయ్?
ముంబై : అందాల తార ఐశ్వర్యరాయ్ ఐటం సాంగులో నటించబోతోందా? ఐటం సాంగుతోనే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి బాలీవుడ్ వర్గాల నుంచి. సంజయ్ లీలా బన్సాలీ తర్వాతి సినిమాలో ఆమె ఐటం నంబర్ చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్.
గతంలో ఐశ్వర్యరాయ్ సంజయ్ లాలీ బన్సాలీ తెరకెక్కించిన 'హమ్ దిల్ దే చుకె సనమ్' చిత్రంలో సల్మాన్ సరసన, 'దేవదాస్' చిత్రంలో షారుక్ ఖాన్ సరసన, 'గుజారిష్' చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటించింది. తాజాగా సంజయ్ లీలా బన్సాలీ రణవీర్-దీపిక జంటగా తెరకెక్కిస్తున్న 'రామ్ లాలా' చిత్రంలో ఆమె ఐటం సాంగు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ ఐశ్వర్యరాయ్‌ని కలిసాడని, రామ్ లీలా చిత్రంలో ఐటం సాంగు చేయాలనే ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. సంజయ్ లీలా బన్సాలీపై గౌరవంతో ఐశ్వర్యరాయ్ ఐటం సాంగు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడాల్సి ఉంది.
రామ్ లాలా సినిమా విషయానికొస్తే....సంజయ్ లీలా బన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రణవీర్ సింగ్, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లు. ఈ సంవత్సరాంతంలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications












