ఐశ్వర్య రాయ్ నిర్ణయం అనుష్క భవిష్యత్..
తాజాగా 'అరుధంతి' చిత్రం హిందీ రీమేక్ రైట్స్ ని జెమినీ వారు తీసుకున్న సంగతి తెలిసిందే. వారు ఈ చిత్రాన్ని త్రీడిలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. అయింతే అరుంధతిగా మాత్రం అనుష్క, ఐశ్వర్య రాయ్ ల మధ్య ఎవరిని ఎంపిక చేస్తారనేది తేలకుంది. మొదటి అనుష్కనే తీసుకుందామనుకున్నా...బాలీవుడ్ కి కొత్త కావటంతో మార్కెట్ కి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారట. అలాగే దీపికా పడుకోని కూడా ప్రపోజల్ లో ఉంది. అయితే ఐశ్వర్య రాయ్ నే ఫైనల్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు ఐశ్వర్య రాయ్ డైట్స్ కోసం సంప్రదిస్తున్నారని సమాచారం.
అయితే రీసెంట్ గా రోబోతో ఐశ్వర్యకు విజయం లభించటం నిర్మాతలను ఆమె వైపు దృష్టి పెట్టే చేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఐశ్వర్యతో చేయటం ద్వారా అంతర్జాతీయంగా లభించే ప్రచారం, వ్యాపారం భారీ ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. అంటే అన్నీ కలిసివస్తే అరుంధతిగా ఐశ్వర్య మన ముందు మరో సారి సాక్షాత్కరిస్తుంది. అయితే ఐశ్వర్య రాయ్ కాదంటే మాత్రం అనుష్కకే ఎక్కువ ఈ పాత్ర వరించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే అనుష్క బాలీవుడ్ భవిష్యత్..ఐశ్వర్య రాయ్ డేట్స్ ఇవ్వటంపై ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











