Mega 157 చిరంజీవితో రొమాంటిక్‌గా ఐశ్వర్యరాయ్ .. మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. యువ హీరోలందరూ సంవత్సరానికి ఒకే సినిమా చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం 2023లో రెండు సినిమాలు రిలీజ్ చేసి తన స్పీడ్ ఏంటో తెలియజెప్పారు. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన ముగ్గురు టాప్ హీరోయిన్లను ఎంపిక చేశారనే విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నది. ఈ ముగ్గురు హీరోయిన్లు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 157వ సినిమాకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్నది. ఇటీవల చిరంజీవిని కలిసి తమ ప్రాజెక్టు స్టేటస్ గురించి యూనిట్ చర్చించడం తెలిసిందే.

అయితే చిరంజీవి నటించబోయే Mega157 కోసం భారీ ఏర్పాట్లు చేయబోతున్నట్టు సమాచారం. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారు. నటీనటుల ఎంపిక కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతున్నది అని తెలుస్తున్నది. ఇప్పటికే నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణులు సెలక్షన్ కూడా దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తున్నది.
అయితే చిరంజీవి నటించబోయే 157వ సినిమాలో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారనే విషయం దక్షిణాది పరిశ్రమలో సంచలనం రేపింది. ఇప్పటి వరకు తెలుగులో ఒకే ఒక సినిమాలో నాగార్జునతో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమాలో పాత్ర బలంగా ఉండటం, చిరంజీవితోపాటు నటించాలనే కోరికతో ఒప్పుకొన్నట్టు తెలిసింది.
ఇక Mega157 మూవీలో మరో సీనియర్ నటి అనుష్క శెట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీతారామంతో విశేషంగా పాపులారిటీ సంపాదించుకొన్న హీరోయని్ మృణాల్ థాకూర్ కూడా గ్లామర్ పాత్రతో కనువిందు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ వార్త ప్రస్తుతం మీడియాలో సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ముగ్గురు హీరోయిన్లతో చిరంజీవి నటించడం ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు.

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. 2023లో సంక్రాంతి పండుగ సీజన్‌లో రిలీజైన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా 270 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక ఇటీవల రిలీజైన భోళా శంకర్ చిత్రం అభిమానులను మెప్పించలేకపోయింంది. ఈ క్రమంలో రీమేక్ సినిమా చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి ఒరిజినల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











