అభిమానులకు షాకిచ్చే రూమర్!
అందాల తార ఐశ్వర్యరాయ్ అభిమానులకు ఇది నిజంగా షాకిచ్చే వార్తే! సౌందర్యంతో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ ప్రపంచ సుందరి త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్ల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
డెలివరీ తర్వాత ఓ సంవత్సరం విరామం తీసుకొని సినిమాల్లో నటిస్తానని ఐష్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితిని గమనిస్తే ఇక ఏ మాత్రం సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్యన రెండు భారీ చిత్రాల్లో నటించడానికి ఐశ్వర్యకు ఆఫర్లు వచ్చాయి.
అయితే నిర్మాతలు ఈ సుందరి మళ్లీ మునుపటిలా స్లిమ్‌గా తయారవ్వాలనే కండీషన్ పెడుతున్నారు. అయితే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి, నాజూకుగా తయారవ్వడానికి వర్కవుట్లతో బిజీ అయిపోతే తన పాప ఆలనాపాలనకు దూరమౌతానేమోనని దిగులు పడుతుందట. మరో వైపు ఆమె మరోసారి తల్లి కావడానికి సిద్ధ పడింది. మరికొన్ని నెలల్లోనే మనం మరో శుభవార్త వినొచ్చనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ కారణాలతోనే భారీ పారితోషికాలతో వచ్చిన ఆఫర్లను కూడా ఈ మద్దుగుమ్మ తిరస్కరిస్తుందని, సినిమా లైఫ్‌కు దూరం కావడానికి సిద్ధంగా వుందని ఆమె సన్నిహితులు అంటున్నారట.
బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్ల పెళ్లయిన తర్వాత తెరకు దూరం అయ్యారు. అప్పుడప్పుడు తెరపై తళుక్కుమన్నప్పటికీ గతంలోలా రాణించలేక పోయారు. మరి ఐశ్వర్య కూడా అదే మాదిరి తమకు దూరం అవుతుందేమోనని ఇటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే...ఐశ్వర్యరాయ్ సంజయ్ లీలా బన్సాలీ చిత్రంతో పాటు, షారుఖ్ సరసన 'హ్యాపీ బర్త్ డే' చిత్రంలో నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తుండటంతో అభిమానులు అయోమయంలో పడుతున్నారు.


Click it and Unblock the Notifications











