Aishwarya rajesh : 300 కోట్ల బ్లాక్‌బస్టర్‌తో టాప్ రేంజ్‌కి.. నెక్ట్స్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్?
చిత్ర పరిశ్రమ హిట్ వెనుక పరుగులు తీస్తుందన్న సంగతి తెలిసిందే. సక్సెస్ లేనివారికి ఇక్కడ ఎలాంటి మర్యాద దొరుకుతుందో? మహామహులే ఎలాంటి అవమానాలు పొందారో? ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే విజయం కోసం నటీనటులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఇక హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే మూడేళ్లు, సక్సెస్ ట్రాక్ బాగుంటే మరో రెండేళ్లు పొడిగింపు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సూత్రం ప్రకారం వ్యవహరిస్తుంటారు హీరోయిన్లు.
సినిమాల రెమ్యునరేషన్ పెంచడం, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, పెట్టుబడులలో డబ్బును మళ్లించడం వంటి వ్యవహారాలు చేస్తుంటారు. గతంలో తమ సీనియర్స్ లాంటి పరిస్ధితి తమకు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేటి తరం భామలు. అన్నింటికి మించి రెమ్యునరేషన్‌ను భారీగా పెంచుతూ ఇండస్ట్రీకి షాకిస్తుంటారు. తాజాగా ఈ కోవలోకే వస్తారు డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్.

కోలీవుడ్‌లో సెటిలైన తెలుగు హీరోయిన్స్‌లో ఐశ్వర్య కూడా ఒకరు. వరుస హిట్ చిత్రాలతో తమిళనాడులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు ఈ ముద్దుగుమ్మ. అందాల ఆరబోతకు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్య రాజేష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో నటించిన ఐశ్వర్య రాజేష్‌ను తమిళనాడు ప్రభుత్వం 2020లో ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారంతో సత్కరించింది.
పరాయి గడ్డ ఈ స్థాయిలో ఆదరిస్తుంటే మన తెలుగులో ఈమెకు అవకాశం రావడానికి ఎంతో కాలం పట్టింద. 2018లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మహిళా క్రికెటర్‌గా ఐశ్వర్య రాజేష్ తెలుగు వారిని పలకరించారు. ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయే అని ఈ సినిమా చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు తెరపై ఘనంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ఐశ్వర్య. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ఈ ఏడాది తొలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే హిట్‌తో పాటు ఐశ్వర్య తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు సినిమా కోటి నుంచి రెండు కోట్లు తీసుకున్న ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు నాలుగు నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం.. కథ డిమాండ్ దృష్ట్యా ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











