RRRలో మరో హీరోయిన్ కూడా: టాలెంటెడ్ బ్యూటీకి జక్కన్న ఆఫర్.. ఇద్దరు భామలతో ఆ హీరో రొమాన్స్!
'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సిద్ధం అవుతోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను తీస్తున్నాడు జక్కన్న. ఇలాంటి పరిస్థితుల్లో RRR నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే.. ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆ వివరాలు మీకోసం!

విప్లవ వీరులుగా... టాలీవుడ్ స్టార్ హీరోలు
టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే మూవీ చేస్తున్నాడు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

చాలా కాలం అవుతోంది.. ఇప్పుడదే పనిలో
RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ చాలా వరకు చిత్రీకరణ మిగిలిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక, ఇటీవలే ఈ సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్‌ను ప్రారంభించారు. ఇందుకోసం అమెరికా నుంచి ఫైటర్లను కూడా తీసుకొచ్చారు. తరచూ వీటికి సంబంధించిన అప్‌డేట్లను ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోందీ చిత్ర యూనిట్.

రెండింటికీ భారీ రెస్పాన్స్.. రికార్డులు బద్దలు
RRR మూవీ దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం తరచూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. అదే సమయంలో ఆ మధ్య వచ్చిన టైటిల్ మోషన్ పోస్టర్‌కు.. రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' దడుదలయ్యాయి. ఈ రెండూ సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే సత్తాను నిరూపించాయి.

మూడో రిలీజ్ డేట్... ఇప్పుడైనా నిజమేనా?
వాస్తవానికి RRR మూవీని జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021కి వాయిదా వేశారు. కానీ, లాక్‌డౌన్ సహా పలు కారణాల వల్ల ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ భారీ సినిమాను అక్టోబర్ 13, 2021న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వెల్లడించారు.

RRRలో మరో హీరోయిన్ ఎంటర్ కాబోతుంది
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRRలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఎంతో మంది బడా సెలెబ్రిటీలు సైతం కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో మరో టాలెంటెడ్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

టాలెంటెడ్ బ్యూటీకి జక్కన్న ఆఫర్.. ఆ పాత్ర
తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపును తెచ్చుకుని.. దక్షిణాదిలోని అన్ని పరిశ్రమల నుంచి ఆఫర్లు అందుకుంటోన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమెనే RRR కోసం తీసుకుంటున్నాడట దర్శకధీరుడు రాజమౌళి. ఈ టాలెంటెడ్ హీరోయిన్‌కు ఇందులో గిరిజన యువతి పాత్రను కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఎంతో కీలకమైన ఈ పాత్ర చాలా సేపు ట్రావెల్ చేస్తుందని సమాచారం.

ఈ ఇద్దరు భామలతో ఆ హీరో రొమాన్స్ ఫిక్స్
RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్.. కొమరం భీంగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అతడు బ్రిటీష్ దొర కూతురి పాత్రను పోషిస్తోన్న ఒలీవియా మోరిస్‌ను ప్రేమిస్తాడని ముందే తెలుసు. అయితే, ఐశ్వర్య రాజేష్ మాత్రం అతడిని ప్రేమిస్తుందట. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనుల సమస్యలకై పోరాటం చేసే కొమరం భీంపై ఆశలు పెట్టుకున్న యువతిగా ఆమె నటిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











