ఆ హీరోతో ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి! అతను ఎవరు? అసలు ఏం జరిగిందంటే?
తమిళ సినీ ఇండస్ట్రీలో అందమైన జంటగా పేరు తెచ్చుకున్నారు ధనుష్ అండ్ ఐశ్వర్య రజనీకాంత్. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఆ మధ్య షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వారి పెళ్లి బంధానికి బ్రేక్ పడటంతో కోలీవుడ్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలవనున్నారని, విడాకులను రద్దు చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత వాటిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ఐశ్వర్య రజనీ కాంత్ రెండో పెళ్లి చేసుకోనుందని తమిళ వర్గాల్లో జోరుగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.
సినీ ఇండస్ట్రీలో : కోలీవుడ్లో స్టార్ హీరోలలో ధనుష్ ఒకరు. సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తెగా పరిచయమైన ఐశ్వర్య రజనీకాంత్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే తమిళ సినీ ఇండస్ట్రీలో ధనుష్-ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉండేదన్న విషయం తెలిసిందే.

విడిపోవాలని:18 ఏళ్లపాటు వివాహ బంధంతో కలిసి ఉన్న ధనుష్-ఐశ్వర్య అనూహ్యంగా జనవరి 18, 2022న విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యేలా చేశారు. 'భార్యాభర్తలుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి సడెన్ షాక్ ఇచ్చారు.
ఎప్పటికైనా అలా: కూతురు, అల్లుడు విడిపోవడంతో సూపర్ స్టార్ రజనీ కాంత్ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్ తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్ తో మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని అప్పుడు చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా? అని ఎంతో ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు.

రెండో పెళ్లి: సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు చివరన ఉన్న ధనుష్ పేరు తొలగించి రజనీకాంత్ పేరును చేర్చి ఐశ్వర్య మరింత షాక్ ఇచ్చింది. దీంతో వాళ్లు ఇక కలవరని అభిమానులు అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి చేసుకుంటుందని తమిళ చిత్ర వర్గాల్లో ఇన్ సైడ్ టాక్ జోరుగా నడుస్తోంది.
తమిళ హీరోతో: ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు సింగిల్ మదర్ గా ఉన్న ఐశ్వర్య రజనీకాంత్ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకుంటుందన్న పుకార్లు రావడానికి కారణం ఈ మధ్య ఆమె ఓ కోలీవుడ్ హీరోతో కనిపించడమే. చెన్నైలోని ఓ రిసార్టులో అతడితో ఐశ్వర్య సన్నిహితంగా మెలుగుతూ దర్శనం ఇచ్చిందట.

రియాక్ట్ అయితే: అలా కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య కనిపించడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లుగా పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో, ఆ హీరో ఎవరనేది మాత్రం తెలియదు. ఈ విషయంపై ఐశ్వర్య రజనీ కాంత్ స్పందిస్తే ఓ కొలిక్కి వస్తుందని సూపర్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. లేకుంటే ఇలాంటి రూమర్స్ వల్ల ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని చర్చిస్తున్నారు.


Click it and Unblock the Notifications











